నర్సాపురం నియోజకవర్గం నుంచి కూటమి తరపున పోటీ చేసేందుకు రఘురామకృష్ణ రాజు రెడీ అయ్యారు. టీడీపీ, జనసేన చీఫ్‌లతో ముందుగానే పరిచయాలు పెంచుకున్నారు. తాను పోరాడుతున్నా కాబట్టి.. నర్సాపురం తనకు.. ఇజ్జత్ మే సవాల్ కాబట్టి టిక్కెట్ తనకే ఇవ్వాలని రఘురామకృష్ణరాజు కోరుతూ వచ్చారు. వారు కూడా రెడీ అయ్యారు. కానీ చివరికి ఆ సీటు బీజేపీ ఖాతాలో పడుతోంది.
నర్సాపురం సీటు బీజేపీకి ఖాయమయింది. కానీ అభ్యర్థి విషయంలో మాత్రం.. చాలా తేడా జరుగుతోంది. రఘురామకృష్ణరాజు పేరు పరిశీలనలో లేదన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. రఘురామ అత్యున్నత స్థాయిలో ప్రయత్నిస్తున్నారు. కానీ ఆయనకు టిక్కెట్ రాకుండా వైసీపీ అధినేత కూడా బీజేపీలోని తన మిత్రుల ద్వారా అంత కంటే ఎక్కువ స్థాయిలోే ప్రయత్నిస్తున్నారు. పొటెన్షియల్ క్యాండిటేట్ అయినప్పటికీ రఘురామ వద్దనే వారి సంఖ్య బీజేపీలో పెరుగుతోంది. పార్టీ కోసం పని చేసిన వారికి కేటాయించాలని కొంత మంది డిమాండ్ చేస్తున్నారు.
బీజేపీ అంతర్గత రాజకీయాలపై కూడా రఘురామ కామెంట్ చేస్తున్నారు. తన కు అభ్యర్థిత్వం దక్కకుండా జగన్ మోహన్ రెడ్డి తన కోవర్టుల ద్వారా ప్రయత్నిస్తున్నారని అంటున్నారు. 2014 ఎన్నికల సమయంలో వైసీపీలో రఘురామ ఉన్నారు. అక్కడ పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో బీజేపీలో చేరారు. పొత్తుల్లో భాగంగా నర్సాపురం సీటు వచ్చినా బీజేపీ ఆయనకు కేటాయించలేదు. తర్వాత ఆయన టీడీపీలో చేరారు. ఇప్పుడు కూడా అలాగే నర్సాపురం సీటు విషయలో హ్యాండిస్తే గట్టి షాక్ తప్పదన్నట్లుగా సీన్ మారిపోతుంది.