తప్పుడు కేసులు పెట్టి నియోజకవర్గానికి వస్తే అరెస్టులు చేయిస్తామని బెదిరిస్తూ నాలుగేళ్ల పాటు రఘురామను నియోజకవర్గానికి రాకుండా చేయగలిగారు వైసీపీ అధినేత జగన్ . నియోజకవర్గానికి రాకపోయినా రఘురామ మాత్రం జగన్ రెడ్డిని ఎప్పుడూ వదిలి పెట్టలేదు. ఇప్పుడు నర్సాపురం నడిబొడ్డున నుంచే జగన్ రెడ్డికి చాలెంజ్ విసరబోతున్నారు. ఈ సంక్రాంతికి ఆయన బలప్రదర్శన చేయబోతున్నారు.
ఎలాంటి తప్పుడు కేసులు పెట్టినా అరెస్టు చేసేందుకు వీలు లేకుండా హైకోర్టు నుంచి ఉత్తర్వలు తెచ్చుకున్నారు రఘురామ. తెలియకుండా కేసులు నమోదు చేసి అరెస్టు చేస్తారని.. రక్షణ కల్పించాలని రఘురామ..తనపై ఇంత వరకూ చేసిన తప్పుడు కేసుల వ్యవహారం.. సీఐడీ ఓ సారి అదుపులోకి తీసుకుని ధర్డ్ డిగ్రీ ప్రయోగించిన అంశాన్నీ వివరించారు. వాదనలు విన్న హైకోర్టు రఘురామకృష్ణరాజుపై నమోదు చేసిన కేసుల విషయంలో 41ఏ సెక్షన్ విధివిధానాలను తప్పనిసరిగా అనుసరించాలని, అరెస్ట్ నుంచి రఘురామకు రక్షణ కల్పించాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. గతంలో ఓ వ్యక్తి కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఏపీ హైకోర్టు ప్రత్యేకంగా ప్రస్తావించింది. రఘురామ నాలుగేళ్ల తర్వాత నియోజవకర్గానికి వస్తూండటంతో బలప్రదర్శన చేస్తున్నారు.
ఎయిర్ పోర్టులో ధిగ్గినప్పటి నుంచి భారీ ర్యాలీ నిర్వహించబోతున్నారు. నాలుగేళ్ల పాటు ఆజ్ఞాతవాసం పూర్తి చేసిన తర్వాత ఇప్పుడు మరింత బలంతో ఆయన జగన్ రెడ్డికి సవాల్ విసిరే అవకాశం కనిపిస్తోంది. ఇప్పుడు జగన్ రెడ్డి ఆయనను టచ్ చేయలేరు. సీఐడీ అధికారులు కూడా ఏమీ చేయలేరు. కానీ రఘురామ మాత్రం తాము చేయాలనుకున్నది చేస్తారు.