‘రఘుతాత’ రివ్యూ: కీర్తి సురేష్ హిందీ కష్టాలు

కీర్తి సురేష్ ఏ భాష‌లో సినిమా తీసినా తెలుగులో కూడా రిలీజ్ అవుతుంది. కానీ ‘రఘుతాత’ మాత్రం కేవ‌లం తమిళ్ కే పరిమితమైయింది. అక్కడ థియేటర్స్ లో రిలీజైన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ ఆడియన్స్ ని పలకరించింది. జీ5 లో విడుదలైన ‘రఘుతాత’లో ప్రేక్షకుల్ని అలరించిన అంశాలేంటి? ఈ పిరియాడిక్ కథలోని విశేషాలేంటి?

తమిళనాడులో హిందీ భాష వ్యతిరేక‌ ఉద్యమాలు జరుగుతున్న రోజులివి. కయల్ పాండియన్‌ (కీర్తి సురేశ్‌) మద్రాసు సెంట్రల్‌ బ్యాంకులో ఉద్యోగం చేస్తుంటుంది. తను మాతృభాషా అభిమాని. ‘కపా’ కలం పేరుతో కథలు రాస్తుంటుంది. ఉద్యోగంలో చేరడానికి ముందు ఉద్యమం చేసిన ట్రాక్ రికార్డ్ అమెది. తనకు పెళ్లి అంటే ఇష్టం వుండదు. అయితే, క్యాన్సర్‌ బారిన పడిన తాత రఘోత్తమన్‌ (ఎం.ఎస్‌. భాస్కర్‌) చివరి కోరిక కయళ్‌ పెళ్లి చూడాలని. దీంతో తనతో కొంత స్నేహంగా వున్న ఎలక్ట్రసిటీ ఇంజినీర్‌ తమిళ్‌ సెల్వన్‌ (రవీంద్ర విజయ్‌)ను పెళ్లి చేసుకోవాలని భావిస్తుంది. సెల్వన్‌ కపా రచనలకు అభిమాని. ఆమె వ్యక్తిత్వాన్ని గౌరవిస్తాడు. అయితే ఇదంతా బయటికి. సెల్వన్ లోపల మనిషి మరోలా ఉంటాడు. తనది చాలా సంకుచిత స్వభావం. పురుష అహంకారి. పెళ్లి తర్వాత కయల్‌ ని తన గుప్పెట్లో వుంచుకోవలనేది సెల్వన్ ఆలోచన. నిశ్చితార్థం తర్వాత సెల్వన్‌ అసలు వ్యక్తిత్వం ఎలాంటిదో తెలుసుకుని షాక్‌ అవుతుంది కయల్‌. తర్వాత ఏం చేసింది? సెల్వన్ తో పెళ్లి తప్పించుకోవడానికి ఎలాంటి ప్లాన్స్ వేసింది? భాషా ఉద్యయం కయళ్ జీవితంలో ఎలాంటి పాత్ర పోషించింది? ఇదంతా మిగతా కథ.

ఇదొక పొలిటికల్, ఫ్యామిలీ డ్రామా. ఈ జోనర్ లోనే ఓ ఫ్రెష్ నెస్ కనిపిస్తుంది. స్త్రీవాదం, హిందీ వ్యతిరేక ఉద్యమం ఈ రెండు కూడా సీరియస్ టాపిక్కులు. ఇలాంటి టాపిక్స్ కు లైటయిర్ ఫ్యామిలీ డ్రామాని జోడించి ‘రఘుతాత’ని తీర్చిదిద్దాడు దర్శకుడు. భాషా ఉద్యమం, కీర్తి సురేష్ పాత్రని పరిచయం చేస్తూ కథ మొదలౌతుంది. ఇది తమిళ సినిమా అయినప్పటికీ కథా గమనంలో మలయాళ సినిమాల ఛాయలు కనిపిస్తాయి. ఒకొక్క పాత్ర, ఆ పాత్రల స్వభావాన్ని ఆకళింపు చేసుకోవడానికి ప్రేక్షకుడికి కాస్త సమయం పడుతుంది. నిజానికి ఇది సీరియస్ కథ.. కానీ దర్శకుడు దీనికి హాస్యాన్ని జోడిస్తూ ఆహ్లాదకరమైన సన్నివేశాలతో ముందుకు తీసుకెళ్ళాడు.

కయల్ ఇంట్లో పెళ్లి గోల, సెల్వన్ ప్రేమకథ, కయల్ హిందీ కష్టాలు, రఘుతాత- డాక్టర్ మధ్య వచ్చే సన్నివేశాలు ఇవన్నీ సున్నితమైన హాస్యాన్ని పంచుతాయి. సెకెండ్ హాఫ్ లో కథ ఇంకాస్త వేగాన్ని పుంజుకుంటుంది. సెల్వన్ నిజస్వరూపం తెలిసిన తర్వాత పెళ్లిని తప్పించడానికి కయల్ చేసే ప్రయత్నాలు, బ్యాంక్ పరీక్ష ఎపిసోడ్ ప్రేక్షకుడిని ఎంగేజ్ చేస్తాయి. ముఖ్యంగా కయల్ మరదలి పాత్రని చలాకీగా తీర్చిదిద్దిన తీరు బావుంది. ఈ కథ 70 కాలం నాటిది. అయితే ఆ పాత్రల స్వభావాలు ఆధునిక ధోరణి కనిపించడం బావుంది. రెగ్యులర్ సినిమాలా కిడ్నాప్ డ్రామాతో క్లైమాక్స్ నడిపినప్పటికీ చివరికి కయల్ పాత్రతో దర్శకుడు చెప్పదలచుకున్న సందేశాన్ని చెప్పాడు.

కయల్ పాత్రలో కీర్తి సురేష్ ఒదిగిపోయింది. ఆధునిక, స్వతంత్ర భావజాలం వున్న పాత్రలో హుందాగా కనిపించింది. ఆడ, మగ సమానత్వం కోసం పాటుపడే పాత్ర తనది. అలాని మరీ ఉపన్యాసాలు దంచించేసేలా వుండదు. హ్యుమర్ టచ్ తో బ్యాలెన్స్ గా ఆ పాత్రని అభినయించింది. టైటిల్ రఘుతాత అని పెట్టారు కానీ కథ మొత్తం కయల్ చుట్టూనే జరుగుతుంది. సెల్వన్ పాత్రలో రవీంద్ర విజయ్ సహజమైన నటనతో ఆకట్టుకున్నాడు. స్త్రీ ఆధిపత్యాన్ని భరించలేని క్యారెక్టర్ లో తనదైన నటన చూపాడు. తాత పాత్రలో చేసిన భాస్కర్ హ్యుమర్ బావుంది. కయల్ మరదలిగా కనిపించిన నటి భలే నవ్విస్తుంది. త‌ను ఈ సినిమాకు స్పెష‌ల్ అట్రాక్ష‌న్‌.

నేపధ్య సంగీతం ఆహ్లాదకరంగా వుంది. మంచి ఆర్ట్ వర్క్ కనిపిస్తుంది. కెమెరాపనితనం సహజత్వాన్ని తీసుకొచ్చింది. దర్శకుడు గంభీరమైన అంశాన్ని సున్నితంగా చెప్పడంలో మంచి ప్రతిభ కనబరిచాడు. తెలుగు డబ్బింగ్ క్వాలిటీ బావుంది కానీ ఇది పూర్తి తమిళ నేపధ్యం వున్న సినిమా. అందుకే తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేయడానికి ఆసక్తి చూపించలేదు. ఎలాంటి కమర్షియల్ ఎలిమెంట్స్ ఆశించకుండా, కాస్త ఓపిక తెచ్చుకొని ఓ లైటర్ వెయిన్ సినిమా చుడాలనుకునే ప్రేక్షకులకు ‘రఘుతాత’ కాలక్షేపాన్ని ఇస్తాడు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

శ్రీవారి లడ్డూలో జంతువుల కొవ్వు – జగన్ హయాంలో అపచారం!

తిరుమలలో ఎన్ని అరాచకాలు చేయాలో అన్నీ చేశారని తేలిపోయింది. చివరికి తిరుపతి లడ్డూ ప్రసాదాన్ని కూడా అపవిత్రం చేశారు. వైసీపీ హయాంలో తిరుపతి లడ్డూ క్వాలిటీ అత్యంత ఘోరంగా ఉండేది. దానికి కారణం...

తమిళనాడు డిప్యూటీ సీఎంగా ఉదయనిధి

తమిళ రాజకీయాలు మారిపోతున్నాయి. ఓ వైపు పొలిటికల్ వాక్యూమ్ ను ఉపయోగించుకుని రాజకీయ నాయకుడు అయిపోవడానికి విజయ్ కొత్త పార్టీ పెట్టారు. మరో వైపు అన్నాడీఎంకే కూడా బలమైన క్యాడర్ తో ఉంది....

వైసీపీ ఆఫీసులకూ అదే పరిస్థితి – లా ఒక్కటే !

నల్లగొండ బీఆర్ఎస్ ఆఫీసును కూల్చేయాలని హైకోర్టు ఇచ్చిన ఆదేశాలతో .. వైసీపీకి కూడా గుండెల్లో రాయి పడింది. బీఆర్ఎస్ పార్టీకి అదొక్కదానికే అనుమతుల్లేవేమో కానీ వైసీపీకి చెందిన ఒక్క ఆఫీసుకు తప్ప...

దేవరని రామాయణంతో ముడిపెట్టిన పరుచూరి

రచయిత పరుచూరి గోపాలకృష్ణ 'పరుచూరి పలుకులు' పేరుతో సినిమాల‌ను విశ్లేషిస్తుంటారు. ఆయన విశ్లేషణలు చాలా ప్రజాదరణ పొందాయి. తన అనుభవాలన్నీ జోడిస్తూ సినిమాల్లోని లోటుపాట్లని, మంచి విషయాల్ని చెపుతుంటారు. తాజాగా ఎన్టీఆర్ దేవర...

HOT NEWS

css.php
[X] Close
[X] Close