సీఎం జగన్కు ఇది అసౌకర్యమైన వార్తే. ప్రధానమంత్రి నరేంద్రమోదీ భీమవరం పర్యటనలో పాల్గొనేందుకు నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజుకు లైన్ క్లియర్ అయింది. తాను 3, 4 తేదీల్లో నర్సాపురంలో పర్యటిస్తానని తనకు రక్షణ కల్పించాలని ఆయన ఏపీ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. తాను వస్తే అరెస్ట్ చేయడానికి ప్రయత్నిస్తారని గతంలో ఇలాగే జరిగిందని ఆయన కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. రఘురామ కృష్ణరాజు లంచ్ మోషన్ పిటిషన్పై విచారణ జరిపిన హైకోర్టు..ఆయనకు రక్షణ కల్పించాలని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది.
పోలీసులు ఇప్పటి వరకూ నమోదైన కేసుల్లో 3, 4 తేదీల్లో అరెస్ట్ చేయవద్దని స్పష్టం చేసింది. కొత్తగా ఏదైనా కేసులు నమోదు చేస్తే చట్టపరమైన ప్రక్రియను అనుసరించాలని ..కేసులు పెట్టి వెంటనే అరెస్ట్ చేయడానికి వీల్లేదని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో ఆయన భీమవరం వెళ్లడం ఖాయమయింది. స్థానిక ఎంపీగా ఆయనకు ప్రోటోకాల్ దక్కుతుంది. వేదిక మీద ఆయనకు చాన్స్ ఉంటుంది. విగ్రహావిష్కరణ కేంద్ర ప్రభు్తవ కార్యక్రమం కాబట్టి .. నిర్వహణ కూడా వారి చేతుల్లోనే ఉంటుంది. ప్రోటోకాల్ కూడా వారే చూస్తారు.
ఎంపీని పక్కన పెట్టడానికి చాన్స్ లేదు. ఇదే కార్యక్రమంలో టీడీపీ తరపున అచ్చెన్నాయుడు.. చిరంజీవికూడా పాల్గొంటారు. వీరిందరి మధ్య సీఎం జగన్ కూడా ఉంటారు. అయితే రఘురామ పాల్గొంటే జగన్ పాల్గొంటారా అన్న సందేహాలు ఉన్నాయి. పారిస్ పర్యటనలో ఉన్న జగన్ మూడో తేదీన తిరిగి రావాల్సి ఉంది. ఏదైనా కారణంతో ఫ్లైట్ ఆలస్యం అయిందని చెప్పి డుమ్మా కొట్టే చాన్స్ ఉందని రఘురామ పిటిషన్పై హైకోర్టు తీర్పు తర్వాత అమరావతిలో గుసగుసలు వినిపిస్తున్నాయి.