కరోనా వ్యాక్సిన్ కోసం దేశం అంతా ఎదురు చూస్తోంది. కేంద్రం కూడా.. వ్యాక్సిన్‌ను రెడీ చేసుకుని.. పదహారో తేదీ నుంచి పంపిణీ చేస్తామని ప్రకటించింది. మొదటగా.. హెల్త్ వర్కర్స్‌కి ఇస్తున్నారు. తదుపరి కరోనా వారియర్స్‌కి ఇస్తారు. ఆ తర్వాత దీర్ఘకాలిక వ్యాధులున్న వృద్ధులకు ఇస్తారు. ఈ మూడు వర్గాలకు మొదటగా ప్రయారిటీ ఇస్తారు. మిగతా వారి సంగతి క్లారిటీ లేదు. దీంతో ఇందులో తమకు చోటు లేదా.. అని ఎంపీ రఘురామకృష్ణరాజుకు డౌట్ వచ్చింది. ఇక్కడ తమకు అంటే… ప్రజాప్రతినిధులకు. ప్రజాప్రతినిధులను కూడా కరోనా వారియర్స్‌గా గుర్తించి .. మొదటి విడతలోనే వారికీ టీకా ఇవ్వాలని ఆయన నేరుగా ప్రధానమంత్రికి లేఖ రాశారు.
కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభించడం సంతోషంగా ఉందని.. అదే సమయంలో.. అనేక మంది ప్రజాప్రతినిధులు కరోనా బారిన పడ్డారని.. కొందరు ప్రాణాలు కోల్పోయారని గుర్తు చేశారు. అందుకే ఫ్రంట్ లైన్ వారియర్స్‌తో పాటు ప్రజాప్రతినిధులకు కూడా వ్యాక్సిన్ ఇవ్వాలని ఆయన కోరారు. ప్రజాప్రతినిధులకు టీకా అంశాన్ని పెద్దగా ఎవరూ పట్టించుకోలేదు. మొదటగా రఘురామకృష్ణరాజే పట్టించుకున్నారు.
నిజానికి ఎక్కువగా జనంలో తిరిగేది ప్రజా ప్రతినిధులే. రిస్క్ కూడా వారికి ఎక్కువ ఉంటుంది. కరోనా టైంలోనూ వారు బయట తిరగాల్సి వచ్చింది. ఒక వేళ దూరంగా ఉంటే.. ప్రజల్ని వదిలేశారన్న అభిప్రాయం ఏర్పడుతుంది. అందుకే రిస్క్ తీసుకుని మరీ.. ప్రజాప్రతినిధులు… రాజకీయ నేతలుగా విధులు నిర్వహిస్తున్నారు. మరి రఘురామకృష్ణరాజు విజ్ఞప్తిపై ప్రధాని ఎలా స్పందిస్తారో వేచి చూడాలి..!