ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురాం రాజన్.. కాంగ్రెస్ ప్రభుత్వాలకు అప్రకటిత ఆర్థిక సలహాదారుగా పని చేస్తున్నారు. భారీ హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వాలకు… వాటిని తీర్చే మార్గాన్ని రాజన్ చూపిస్తున్నట్లుగా తెలుస్తోంది. గతంలో కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే అక్కడి ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రితో సమావేశమయ్యారు. కొన్ని సలహాలు ఇచ్చారు. ఇప్పుడు తెలంగాణ కొత్త ప్రభుత్వంతోనూ ఆయన చర్చలు జరుపుతున్నారు.
రఘురామరాజన్ సుప్రసిద్ధ ఆర్థిక వేత్త. ఆర్బీఐ గవర్నర్ గా ఆయన చేసిన సమయంలో దేశంలో ఆర్థిక వృద్ధి హైరేంజ్ లో ఉంది. బీజేపీ విధానాలతో ఆయనకు సరిపడలేదు. దాంతో బీజేపీ వచ్చాక ఆయన ప దవి కాలం పొడిగించలేదు. తర్వాత ఆయన లండన్ వెళ్లిపోయి .. తన వ్యాపకాల్లో బిజీ అయిపోయారు. ఆ వ్యాపకాలు.. పూర్తిగా ప్రపంచ ఆర్థిక స్థితిగతుల గురించే ఉంటాయి. అందుకే ఇండియా ఎకానమీపైనా తరచూ ఆయన వ్యాఖ్యలు చేస్తూంటారు.
కాంగ్రెస్ ప్రభుత్వాలు ఆయన సలహాలు కోరుకుటంున్నాయి. అందుకే… ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల్ని వివరించి… హామీల ను ముందు పెట్టి ఎలా అమలు చేయాలన్నదానిపై ఆయన దగ్గర సలహాలు తీసుకుంటున్నారని చెబుతున్నారు. ఆదాయాలను పెంచుకోవడం… ఖర్చులు తగ్గించుకోవడం… పథకాలు ప్రజల జీవన ప్రమాణాల్ని పెంచేలా చూసుకోవడం వంటి వాటిపై ఆయన సలహాలిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఆ సలహాలు ఫలిస్తే… తెలంగాణ సర్కార్కు తిరుగు ఉండదు.