రఘురామకృష్ణరాజు ఫోన్ వ్యవహారం కీలక మలుపులు తిరుగుతోంది. తన ఫోన్‌ను గుంటూరు సీఐడీ పోలీసులు అనధికారికంగా స్వాధీనం చేసుకున్నారని.. అనధికారికంగా ఉపయోగించారని… ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన ఫోన్ ద్వారా వాట్సాప్ మెసెజులు కొంత మందికి పంపుతున్నట్లుగా ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతకు ముందు ఉదయమే సీఐడీ స్టేషన్ హౌస్ ఆఫీసర్‌కి… సీఐడీ ఏడీజీ సునీల్‌కుమార్‌కు లీగల్ నోటీసులు పంపించారు. తన వద్ద నుంచి ఫోన్ స్వాధీనం చేసుకుని.. కోర్టులో సమర్పించకుండా… దుర్వినియోగం చేస్తున్నట్లుగా నోటీసు పంపించారు. ఆ సమయంలోనే .. ప్రభుత్వ మాజీ సలహాదారు.. రిటైరైన సీనియర్ ఐఏఎస్ అధికారి పీవీ రమేష్ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు.
రఘురామకృష్ణరాజుకు చెందిన ఫోన్ నెంబర్‌ను అందులో పోస్ట్ చేసి.. ఆ నెంబర్ ఉన్న వాట్సాప్ నుంచి అనేక మెసెజ్‌లు తన కుటుంబసభ్యులకు వస్తున్నాయని… ప్రజలకు తెలియాలని తాను ట్వీట్ చేస్తున్నట్లుగా చెప్పుకొచ్చారు. దీనికి రఘురామకృష్ణరాజు రిప్లయ్ ఇచ్చారు. గత నెల పధ్నాలుగో తేదీ నుంచి ఈ నెల ఒకటో తేదీ వరకు తన ఫోన్.. సీఐడీ పోలీసుల అధీనంలో ఉందని.. ఈ సమయంలో వచ్చిన ఫోన్ కాల్స్‌కు.. టెక్ట్స్‌కు తనకు సంబంధం లేదని తెలిపారు. తన ఫోన్‌ను కోర్టులో కూడా ప్రొడ్యూస్ చేయకపోవడం… స్వాధీనం చేసుకున్న వస్తువుల్లో కూడా చూపించకపోవడంతో.. సిమ్‌ను బ్లాక్ చేయించి.. కొత్త సిమ్ తీసుకున్నట్లుగా చెప్పారు.
పీవీ రమేష్ సోదరి .. సీఐడీ ఏడీజీ సునీల్ కుమార్ భార్య. ఇద్దరి మధ్య కుటుంబ తగాదాలున్నాయి. గతంలో ఆమె పీవీ సునీల్‌పై హైదరాబాద్‌లో కేసు కూడా పెట్టింది. ప్రస్తుతం ఆ కేసు పీవీ సునీల్ కుమార్ పై ఉంది. ఇలాంటి సందర్భంలో… కస్టడీలోకి తీసుకున్న రఘురామకృష్ణరాజు ఫోన్ నుంచి… ఆమెకు వాట్సాప్ సందేశాలు వెళ్లడం కలకలం రేపుతోంది. దీనిపై సీఐడీ అధికారులు ఎలాంటి ప్రకటనా చేయలేదు. రఘురామకృష్ణరాజు ఫోన్‌ను స్వాధీనం చేసుకోకపోతే.. ఆ విషయాన్ని వెంటనే సీఐడీ ఖండించి ఉండేది.
ఒక వేళ స్వాధీనం చేసుకుని.. కోర్టులో ప్రొడ్యూస్ చేయకపోతే.. తప్పవుతుంది. జడ్జి రామకృష్ణ ఫోన్ పోగొట్టినట్లుగా ..పోయిందని చెప్పడానికి సిద్ధమైతే… అసలు.. స్వాధీనం చేసుకున్న విషయాన్ని కూడా ఎందుకు నమోదు చేయలేదన్నది పెద్ద చర్చనీయాశం అవుతుంది. ఒక వేళ తాము తీసుకోలేదని..వారిస్తే.. ఫోన్ ఐఎంఈఐ ద్వారా… ఆ సమయంలో ఎక్కడెక్కడ ఉందో.. ఎక్కడెక్కడ నుంచి వాట్సాప్ మెసెజులు పంపించారో తెలుసుకోవడం పెద్ద విషయం కాదు. అందుకే రఘురామకృష్ణరాజు ఫోన్ వ్యవహారం ఇప్పుడు కలకలం రేపుతోంది.