రఘురామకృష్ణరాజును మళ్లీ గుంటూరు రప్పించేందుకు సీఐడీ పోలీసులు తమ శక్తినంతా ఉపయోగిస్తున్నారు. ఆయన పూచికత్తులను ఆమోదించడానికి సాంకేతిక కారణాలు వెదుక్కుంటున్నారు. ఫలితంగా.. రఘురామకృష్ణరాజు అనధికారికంగా విడుదలై వెళ్లిపోయారన్న అభిప్రాయాన్ని కల్పిస్తున్నారు. అనూహ్యంగా బుధారం..రఘురామ రిమాండ్‌ను ఈ నెల 25 వరకు పొడిగిస్తూ సీఐడీ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే బెయిల్‌పై విడుదలైన రఘురామకృష్ణరాజుకు రిమాండ్ విధించడం ఏమిటని చాలా మందికి ఆశ్చర్యం వేసింది. తర్వాత అసలు విషయం అర్థం కావడంతో.. సీఐడీ ఇప్పటికీ.. ఆయనపై కొత్తకొత్తవ్యూహాలు అమలు చేస్తోందని విశ్లేషిస్తున్నారు.
రఘురామకృష్ణరాజుకు బెయిల్ మంజూరు చేసినసుప్రీంకోర్టు విడుదలైన పది రోజుల్లో బాండ్లు సమర్పించమని ఆదేశించింది. ఆ మేరకు ఆర్మీ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయి ఢిల్లీ వెళ్లిపోయిన ఎంపీ తరపున… మూడు రోజుల తర్వాత ఆయన లాయర్లు బాండ్లు సమర్పించారు. వాటిని కోర్టు సీఐడీ అధికారులకు పంపింది. బెయిల్ ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించింది. అయితే సీఐడీ అధికారులు ఇక్కడే తెలివి తేటలు ప్రదర్శించారు. వాటిని ఆర్మీ ఆస్పత్రికి పంపారు. ఆయన డిశ్చార్జ్ అయ్యారని తెలిసి కూడా పంపారు. దీంతో ఆర్మీ ఆస్పత్రి వాటిని మళ్లీ వెనక్కి పంపింది. ఆ తర్వాత సీఐడీ సైలెంట్‌గా ఉండిపోయింది.ఫలితంగా కోర్టు మరోసారి రిమాండ్ విధించింది.
రఘురామను మళ్లీ గుంటూరు రప్పించే వ్యూహాన్ని సీఐడీ అధికారులు అమలు చేస్తున్నారని ఆయన తరపు లాయర్లు అంటున్నారు. రఘురామరాజు.. ఆర్మీ ఆస్పత్రి నుంచే తనను మరోసారి అరెస్ట్ చేసేందుకు ప్రయత్నాలు చేశారని ఆరోపిస్తూ.. ఓ ప్రణాళికప్రకారం..డిశ్చార్జ్ అయిపోయి..ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్లారు. ఆయన ఫిర్యాదు వల్ల గుంటూరు అర్బన్ ఎస్పీని బదిలీ చేశారు. ఈ క్రమంలో రఘురామను వదిలి పెట్టేది లేదని.. ఏ సందు దొరికినా మళ్లీ పిలిపిస్తామని సీఐడీ. … తాజా చర్యల ద్వారా నిరూపిస్తోందని అంటున్నారు. ఈ కేసు మళ్లీ అనూహ్యమైన మలుపులు తిరగడం ఖాయంగా కనిపిస్తోంది.