మాజీ ఎంపీ, ఉండి నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు తనపై జరిగిన కస్టోడియల్ టార్చర్ పై గుంటూరు ఎస్పీకి ఫిర్యాదు చేశారు. 2021లో తనను పోలీసు కస్టడీలో చిత్రహింసలకు గురిచేశారని ఆరోపిస్తూ జగన్ మోహన్ రెడ్డి, అప్పటి సీఐడీ చీఫ్ పీవీ సునీల్ కుమార్, ఐపీఎస్ సీతామాంజనేయులు, ఇతర అధికారులపై ఫిర్యాదు చేశారు. ఈ మేరకు అప్పట్లో జరిగిన ఘటనలతో పాటు వాటికి సంబంధించిన సాక్ష్యాలను కూడా జత చేశారు.
2021 మే 14వ తేదీన రఘురామకృష్ణరాజు పుట్టిన రోజు సందర్భంగా కుటుంబసభ్యులతో వేడుకలు జరుపుకుంటున్న సమయంలో ఏపీ సీఐడీ పోలీసులు ఆయన ఇంటిపై విరుచుకుపడ్డారు. ఏ కేసు పెట్టారో.. ఎందుకు అరెస్టు చేస్తున్నారో కూడా చెప్పలేదు. వెంటనే గుంటూరుకు తరలించారు. తర్వాత సీఐడీ అధికారులు సుమోటో రాజద్రోహం కేసులు పెట్టినట్లుగా ప్రకటించారు. ఆ రాత్రికి ఆయనపై హత్యాయత్నం చేశారు. చివరికి ఈ వ్యవహారం సుప్రీంకోర్టుకు చేరి ఆర్మీ ఆస్పత్రిలో పరీక్షల వరకూ వెళ్లింి.
. ఆ తర్వాత తనపై జరిగిన దాడి విషయంలో రఘురామ న్యాయపోరాటం చేస్తున్నారు. తనను అరెస్టు చేసిన అధికారుల కాల్ రికార్డులను భద్ర పరిచేలా.. ఆదేశాలు తెచ్చుకున్నారు. సీబీఐ దర్యాప్తు కోసం దాఖలు చేసిన పిటిషన్ హైకోర్టులో పెండింగ్ లో ఉంది. ఇప్పుడు ప్రభుత్వం మారడంతో రఘురామ ఫిర్యాదు చేశారు. ఇప్పటికే ఈ అంశంపై పూర్తి స్థాయి వివరాలతో రెడీగా ఉన్నారని చంద్రబాబు ప్రమాణం తర్వాత ఇందులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని అంచనా వేస్తున్నారు.