రఘురామ కృష్ణరాజు ఉండి టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగడం దాదాపుగా ఖరారైంది. సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజును ఒప్పించేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. ఆయనను వైదొలగాల్సిందేనని చెప్పడంతో .. నియోజకవర్గానికి వెళ్లి కార్యకర్తలతో చర్చించారు. తనను తప్పుకోమంటున్నారని కన్నీరు పెట్టుకుంటున్నారు. అయితే ఆయన గతంలో సీటు ఎలా వచ్చిందో ఇప్పుడు అలాగే పోయే అవకాశం ఉండటం యాధృచ్చికం.
గతంలో వేటుకూరి శివరామరాజు ఎమ్మెల్యేగా ఉండేవారు. టీడీపీ తరపున రెండు సార్లు గెలిచారు. గత ఎన్నికల్లో రఘురామకృష్ణరాజు చివరి క్షణంలో టీడీపీకి రాజీనామా చేసి వైసీపీ తరపున పోటీ చేయడంతో శివరామరాజు ఎంపీగా పోటీ చేయాల్సి వచ్చింది. ఉండి అభ్యర్తిగా శివరామరాజు సిఫారసు చేసిన రామరాజుకే చంద్రబాబు చాన్సిచ్చారు. అయితే శివరామరాజు ఓడిపోయారు. రామరాజు గెలిచారు. ఇప్పుడు తన సీటు తనకు ఇవ్వాలని కోరిన రామరాజు ఇవ్వలేదు. దాంతో రెబల్ గా శివరామరాజు బ రిలోకి దిగుతానని ప్రచారం చేసుకుంటున్నారు.
రఘురామకే టిక్కెట్ ఖరారు చేస్తే రామరాజు పోటీ నుంచి తప్పుకుంటారా లేక స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగుతారా అన్నది సస్పెన్స్ గా మారింది. రఘురామకు, మాజీ ఎమ్మెల్యే శివకు మధ్య మెరుగైన సంబంధాలున్నాయి. ఒక వేళ రఘురామకు చాన్సిస్తే… శివ మద్దతుగా ఉంటారని చెబుతున్నారు. ఆయన మద్దతు ఉంటే రామరాజు రెబల్ అయినా సమస్య రాదని అంటున్నారు. కానీ రఘురామ అభ్యర్థిగా.. ఇద్దరు టీడీపీ రెబల్స్ గా ఉంటే వైసీపీకి అడ్వాంటేజ్ అయ్యే అవకాశం ఉంది.
టీడీపీ ఆవిర్భవించాక 1983 నుంచి ఇప్పటి వరకూ జరిగిన ఎన్నికల్లో ఒక 2004లో మినహా మిగిలిన అన్నిసార్లూ ఉండిలో టీడీపీ అభ్యర్థులే ఇక్కడ గెలుపొందారు. రాష్ట్ర వ్యాప్తంగా 2009లో కాంగ్రెస్, 2019లో వైసిపి గాలి వీచినా ఇక్కడ మాత్రం టీడీపీ అభ్యర్థులే గెలిచారు.