వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ రఘురామకృష్ణంరాజు ఆకస్మికంగా.. భారతీయ జనతా పార్టీ పార్లమెంటరీ పార్టీ కార్యాలయంలో ప్రత్యక్షమయ్యారు. ఆయన అక్కడ ఎవరితో.. ఏ అంశంపై చర్చించారో బయటకు రాలేదు కానీ… దాదాపుగా గంటకుపైగా.. ఆయన … బీజేపీ కార్యాలయంలో.. గడిపినట్లుగా తెలుస్తోంది. ఓ వైపు పార్లమెంట్ జరుగుతున్న సమయంలో… ఆయన ఇలా బీజేపీ ఆఫీసు వైపు రావడం .. ఇతర ఎంపీలను ఆశ్చర్యానికి గురి చేసింది.
విజయసాయిరెడ్డికి, మిధున్ రెడ్డికి చెప్పకుండా.. కేంద్ర మంత్రులకే కాదు.. నేరుగా ప్రధానిని కూడా కలవవద్దని.. జగన్మోహన్ రెడ్డి కట్టడి చేశారు. పార్టీ విధానాలకు వ్యతిరేకంగా మాట్లాడవద్దని స్పష్టం చేశారు. కానీ.. రఘురామకృష్ణంరాజు మాత్రం.. లోక్సభలో తొలి రోజే… మాతృభాషకు అనుకూలంగా మాట్లాడారు. ఆ తర్వాత ప్రధానమంత్రి నరేంద్రమోదీ.. ఆయనను సెంట్రల్ హాల్లో ఆప్యాయంగా పలకరించడంతో పరిస్థితి మారిపోయింది. వెంటనే.. జగన్మోహన్ రెడ్డి… అమరావతి పిలిపించి.. వివరణ తీసుకున్నారు. అంతకు ముందు సుజనా చౌదరి… వైసీపీకి చెందిన ఎంపీలు కొంత మంది టచ్లో ఉన్నారని.. తమతో కలిసి రావాలనుకున్న వాళ్లే కలుస్తున్నారని చెప్పి కలకలం రేపారు.
అయితే.. ఈ వ్యాఖ్యలను రఘురామకృష్ణంరాజు తోసి పుచ్చారు. తాము ఎవరితోనూ టచ్లో లేమన్నారు. అలా అన్న ఒక్క రోజులోనే… రఘురామకృష్ణం రాజు.. బీజేపీ పార్లమెంటరీ పార్టీ ఆఫీసులో ప్రత్యక్షమయ్యారు. సాధారణంగా… ఒక పార్టీ ఆఫీసులోనికి మరో పార్టీ ఎంపీలు… అంత తేలిగ్గా వెళ్లరు. మామూలుగా ఏ రాజకీయ వివాదాలు లేకపోతే.. వెళ్లినా ఎవరూ పట్టించుకోరు. కానీ .. రఘురామకృష్ణంరాజు బీజేపీతో టచ్లో ఉన్నారన్న ఆరోపణలు వస్తూండగా.. ఆయన తన పని తాను చేసుకోవడంతోనే.. వైసీపీ వర్గాల్లోనూ అనుమానాలు రేకెత్తుతున్నాయి.