రఘురామకృష్ణరాజుపై అనర్హతా వేటు వేయిస్తామని వైసీపీ నేతలు గంభీరమైన పలుకులు పలుకుతున్నారు కానీ ఢిల్లీలో పరిస్థితులు మాత్రం అంత అశాజనకంగా కనిపించడం లేదు. జగన్ వస్తే తప్ప… కేంద్రమంత్రుల అపాయింట్మెంట్లు లభించడం లేదు. ఇతర వైసీపీ నేతలకు అసలు సమయం కేటాయించడం లేదు. కానీ అదే సమయంలో ఎంపీ రఘురామకృష్ణరాజు మాత్రం రోజుకు ఇద్దరు కేంద్రమంత్రులతో తగ్గకుండా సమావేశాలు నిర్వహిస్తున్నారు. జగన్ ఢిల్లీ పర్యటన నుంచి వెళ్లిన తర్వాత ఇక ఏ క్షణమైనా రఘురామపై వేటు అని ప్రచారం చేశారు వైసీపీ నేతలు. అయితే.. రఘురామకృష్ణరాజు.. ఆ తర్వాత స్పీకర్ ఓంబిర్లాను కలిసి… ముచ్చట్లు పెట్టి వచ్చారు. అనర్హతా వేటు వేయాలంటే… ఓ వివరణ అయినా తీసుకుంటారు.ఆ వివరణ కోసం కూడా.. రఘురామకు స్పీకర్ నోటీసులు ఇవ్వలేదు.
మరో వైపు బీజేపీ అగ్రనేతలతో రఘురామకృష్ణరాజు అదే పనిగా టచ్‌లో ఉంటున్నారు. కేంద్రమంత్రులను కలుస్తున్నారు. తనపై సీఐడీ చేసిన దాడి గురించి చెబుతున్నారు. వారందరి వద్ద నుంచి సానుభూతి పొందుతున్నారు. ఇప్పటికే రాష్ట్రపతి నుంచి గవర్నర్ల వరకూ.. చెప్పాల్సిన రాజ్యాంగ వ్యవస్థలన్నింటికీ..తనపై జరిగిన దాడి గురించి చెప్పేశారు. ఇక పార్లమెంట్ సమావేశాల్లో తాన ఈ విషయం లేవనెత్తుతానని ఆయన చెబుతున్నారు. మామూలుగా రఘురామకృష్ణరాజు దేన్నైనా చాలా ప్రభావవంతంగా ప్రజల్లోకి వెళ్లేలా చెబుతున్నారు. రేపు పార్లమెంట్లో ఈ అంశాన్ని ప్రస్తావిస్తే… అందరూ సమర్థిస్తే.. ఏపీ సర్కార్‌కు మరింత ఇబ్బందికరం అవుతంది.
పార్లమెంట్లో సీఐడీ ప్రయోగించిన ధర్డ్ డిగ్రీపై ఎలాంటి చర్చ జరగకుండా ఉండాలన్న లక్ష్యంతో ముందుగానే రఘురామకృష్ణరాజుపై అనర్హతా వేటు వేయించాలని వైసీపీ టార్గెట్‌గా పెట్టుకుందని చెబుతున్నారు. కానీ వైసీపీ పవర్‌ను… రఘురామ తమ..పరిచయాలతో ఎదుర్కొంటున్నారు. నిర్ణయం తీసుకోవాల్సిన స్పీకర్ ఓంబిర్లాతో పాటు నిర్ణయాన్ని ప్రభావితం చేయగలిగిన బీజేపీ పెద్దలతో సన్నిహితంగా ఉంటున్నారు. బీజేపీలోని రాజ్‌పుత్ వర్గం… రఘురామకృష్ణరాజుకు పూర్తి స్థాయిలో మద్దతుగా నిలిచినట్లుగా తెలుస్తోంది. ఎలా చూసినా.. వైసీపీ .. రఘురామ విషయంలో సక్సెస్ కాదన్న అభిప్రాయం మాత్రం ఢిల్లీలో గట్టిగా వినిపిస్తోంది.