నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజుకు.. సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చిన సమయంలో ఆ కేసు గురించి బయట మాట్లాడవద్దని షరతు పెట్టింది. అదేవిధంగా గాయాలు కూడా చూపించవద్దని ఆదేశించింది. దానికి తగ్గట్లుగానే రఘురామకృష్ణరాజు.. ఆ కేసు గురించి ఎక్కడా మాట్లాడటం లేదు. కానీ.. చర్చ మాత్రం.. రీసౌండ్ వచ్చేలా చేస్తున్నారు. ప్రతీ రోజూ.. మీడియాలో హైలెట్ అయ్యేలా చేస్తున్నారు. దీంతో అటు సుప్రీంకోర్టు షరుతులను పాటిస్తూనే.. తన వ్యూహాన్ని తాము అమలు చేస్తున్నారు.
నర్సాపురం ఎంపీ రఘురాకృష్ణరాజు.. తనపై సీఐడీ పోలీసులు ప్రయోగించిన ధర్డ్ డిగ్రీని తేలికగా తీసుకోవడం లేదు. కొట్టినా ఆయన చెప్పుకోలేరని.. కొట్టారేమో కానీ.. ఆయన మాత్రం.. చెప్పుకోవడానికి ఏ మాత్రం సంశయించడం లేదు. దేశంలో ప్రతీ వ్యవస్థకు విపులంగా సీఐడీ పోలీసులు తనను ఎలా కొట్టారో వివరిస్తూ లేఖలు రాస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రపతి సహా… మానవహక్కుల సంఘం వరకు ప్రతి వ్యవస్థకు ఫిర్యాదు చేసిన ఆయన ఇప్పుడు.. పార్లమెంట్లో ప్రతీ ఎంపీకీ తనకు జరిగిన అన్యాయాన్ని వివరిస్తున్నారు. వారు … సోషల్ మీడియాలో… ఏపీ సర్కార్‌పై విరుచుకుపడుతున్నారు. ఇది మీడియాలో హైలెట్ అవుతోంది.
రఘురామ లేఖలు చదివినే వెంటనే.. వెంటనే ఎంపీ, కాంగ్రెస్ నేత మాణికం ఠాగూర్ ట్విటర్లో ఫైర్ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఆయన పట్ల క్రూరంగా, పచ్చి ఉన్మాదంతో వ్యవహరించారని మండిపడ్డారు. సైద్ధాంతికంగా తాను రఘురామతో విభేదిస్తాననీ..కానీ ఒక పార్లమెంటేరియన్ పట్లే ఈ విధంగా జరిగితే ఆంధ్రప్రదేశ్‌లో సామాన్య రాజకీయ కార్యకర్తల మాటేమిటి? అదేమన్నా హిట్లర్ రాజ్యమా అని ప్రశ్నించారు. ఆ తర్వాత కర్ణాటకలోని మాండ్య ఎంపీ సుమలత కూడా అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మహారాష్ట్ర మహిళా ఎంపీలు కూడా ఖండించారు. మరో రోజు కేరళ ఎంపీ ప్రేమ్‌చంద్రన్ స్పందించారు. ఎంపీపై పోలీసులు దాడి చేసి గాయపరచడం పార్లమెంట్‌కు అవమానమని వ్యాఖ్యానించారు. ఢిల్లీ ఎంపీ పరదేశ్ సాహెబ్ సింగ్ కూడా రఘురామ పై దాడిని విమర్శించారు. మతమార్పిడులు, మిషనరీలకు వ్యతిరేకంగా గళం విప్పడమే తప్పా? అని పరదేశ్ సాహెబ్ సింగ్ నిలదీశారు.
రఘురామ వ్యూహం… తన కేసు వీలైనంత కాలం ప్రజల్లో నానేలా చేయడం. దానికి ఏపీ సర్కార్ పన్నిన వ్యహాలను చిత్తు చేస్తూ మందుకెళ్తున్నారు. పార్లమెంట్లో ఎంపీలంతా తనకు మద్దతిచ్చేలా చూసుకుంటున్నారు. పార్లమెంట్లో మాట్లాడటానికి రఘురామకు పర్మిషన్ వస్తే.. ఆయన ఏపీ సర్కార్‌పై మరింతఘాటుగా విరుచుకుపడే అవకాశం ఉంది.