నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు ఈ సారి సంక్రాంతి నర్సాపురంలోనే చేసుకోనున్నారు. ఏపీలో అడుగు పెడితే జగన్ రెడ్డి మార్క్ ప్రజాస్వామ్యంలో ప్రాణాలకు గ్యారంటీ లేని పరిస్థితుల్లో ఆయన చాలా కాలంగా ఢిల్లీ, హైదరాబాద్ కే పరిమితమయ్యారు. ఓ పుట్టినరోజు నాడు హైదరాబాద్ నుంచి పోలీసులు అరెస్టు చేసి తీసుకెళ్లి ధర్డ్ డిగ్రీ కూడా ప్రయోగించారు. దీనికి ఆయనపై పెట్టిన కేసు రాజద్రోహం. ఎందుకంటే… మీడియాతో రోజూ మాట్లాడుతూ విమర్శలు చేస్తున్నారని
గతంలో రెండు, మూడు సార్లు నర్సాపురం వెళ్లేందుకు రఘురామ ప్రయత్నించారు. కోర్టుల నుంచి ఊరట పొందేందుకు ప్రయత్నించారు. కానీ పోలీసులు ఎన్ని కేసులు పెట్టారో లెక్క తెలియడం లేదు. సీక్రెట్ ఎఫ్ఐఆర్ లు ఎన్ని ఉన్నాయో తెలియదు. రాత్రికి రాత్రి అరెస్టు చేయడం.. ఇష్టం వచ్చినట్లుగా హింసించడమే సీఐడీ పని. అందుకే.. రఘురామకృష్ణరాజు నర్సాపురం వెళ్లలేకపోయారు. ఆయన వెళ్లలేకపోయినా ఆయన కుమారుడు మాత్రం నియోజకవర్గానికి వెళ్లి పనులు చక్క బెడుతున్నారు.
ఎక్కడ ఉన్నా నర్సాపురంలో సంక్రాంతి చేసుకోవడం రఘురామకు అలవాటు. గత నాలుగేళ్లుగా ఆయన సంక్రాంతికి దూరమయ్యారు. ఈ సారి మాత్రం వెళ్తున్నారు. ఎన్నికలకు ముందు పోలీసులు ఎంత ఓవరాక్షన్ చేస్తే… రఘురామకు అంత ప్లస్ అవుతుంది. అందుకే ఈ సారి నర్సాపురంలోనే సంక్రాంతి పండుగ చేసుకునేందుకు సిద్ధమయ్యారు.