ఏ కేసులు పెట్టారో కూడా చెప్పకుండా మనుషుల్ని రాత్రికి రాత్రి ఎత్తుకుపోయే సరికొత్త వ్యవస్థగా మారిన సీఐడీని రఘురామకృష్ణరాజు బెదిరిస్తున్నారట. తాము సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్తామని వారు హెచ్చరిస్తున్నారు. వారు ఈ విషయాన్ని సుప్రీంకోర్టుకు తీసుకెళ్లదల్చుకుంటే రాజకీయ నేతల్లా.. మీడియాకు ప్రకటనలు చేసేవారు కాదు..నేరుగా సుప్రీంకోర్టులో పిటిషన్ వేస్తే అదే మీడియాకు సమాచారం అయ్యేది. కానీ.. తమను రఘురామకృష్ణరాజు బెదిరిస్తున్నారంటూ… మీడియాకు సమాచారం ఇచ్చారు. అసలు ఈ బెదిరింపులు ఏమింటే… తన ఫోన్ గురించి.. రఘురామకృష్ణరాజు ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేయడం. లీగల్ నోటీసులు పంపించండి.
రఘురామరాజు ఫోన్ విషయంలో సీఐడీ రఘురామకృష్ణరాజు చేసిన ఆరోపణలన్నింటినీ ఖండించింది. ఆయన ఫోన్‌ను అధికారికంగానే సీజ్ చేశామని.. కోర్టులో ప్రొడ్యూస్ చేశామని చెప్పింది.కానీ ఇప్పుడు అది ఫోరెన్సిక్ ల్యాబ్ కస్టడీలో ఉందని చెబుతోంది. ఆ ఫోన్ మోడల్.. అందులో ఉన్న నెంబర్ గురించి తమకేమీ తెలియదని… రఘురామకృష్ణరాజు చెప్పిందే రాసుకున్నామని సీఐడీ చెబుతోంది. ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ వస్తేనే అసలు నిజం తెలుస్తుందని… సీఐడీ చెబుతోంది. ఫోన్‌ను స్వాధీనం చేసుకుని.. మే 18న సెల్ ఫోన్ ను ప్రాథమిక విశ్లేషణ ,డేటా , ఫొటోలు డంపింగ్ చేసేందుకు ఏపి ఎస్ ఎఫ్ ఎల్ కు పంపామని ఇంకా అక్కడే ఉందని సీఐడీ చెబుతోంది. ఫోన్‌ను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపిన పది రోజుల తర్వతా అంటే 27న తేదీన ఫోన్ నుంచి డంపింగ్ చేసిన వివరాలను.. విశ్లేషణ చేసిన డేటా వివరాలను మే 31న కోర్టుకు సమర్పించామని చెప్పుకొచ్చారు.
రఘురామకృష్ణరాజు ఢిల్లీలోఫిర్యాదు చేశారని.. మే 18 వ తేదీ నుంచి సెల్ ఫోన్ ఏపి ఎఫ్ ఎస్ ఎల్ కస్టడీలో ఉంది కాబట్టి..సీఐడి అధికారులు వినియోగించే అవకాశం లేదని వాదించారు. మీడియాలో వచ్చిన కథనాలకు సీఐడీ ఎలా స్పందించిందో కానీ.. బెదిరిస్తున్నారన్నట్లుగా సీఐడీ కొత్తగా ప్రొజెక్ట్ చేయజానికి ప్రయత్నించడం ఆసక్తి రేపుతోంది. సుప్రీంకోర్టుకు వెళ్తామని చెప్పడం ద్వారా.. రఘురామకృష్ణరాజునే.. స్లో అవ్వాలని హెచ్చరించినట్లు అయిందన్న విశ్లేషణలు కూడా ఇతరుల నుంచి వస్తున్నాయి. సీఐడీ ఏదైనా చట్ట ప్రకారం చేయాలి.. మీడియాతో మైండ్ గేమ్ ఆడటం రాజకీయం అవుతుంది. ఇప్పుడు సీఐడీ అదే చేస్తోందన్నవిమర్శలు ఎదుర్కొంటోంది.