అసెంబ్లీలో హాల్ లో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. జగన్ అంటేనే అంతెత్తున లేచే టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు వైసీపీ అధినేత జగన్ భుజంపై చేయి వేసి పలకరించడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. మొదట హాయ్ జగన్ అని పలకరించిన రఘురామ.. రోజూ అసెంబ్లీకి రావాలని కోరారు. దాంతో రెగ్యులర్ గా వస్తాను.. మీరే చూస్తారుగా అంటూ జగన్ బదులిచ్చారు.
రఘురామ- జగన్ ఇంకా ఏం మాట్లాడుకున్నారు అన్నది తెలియదు కానీ, వారి సంభాషణ మాత్రం ఆసక్తికరంగా మారింది. జగన్ తో ముచ్చటిస్తోన్న సమయంలోనే పయ్యావులను గమనించిన రఘురామ..తనకు అసెంబ్లీలో జగన్ పక్కనే సీట్ కేటాయించాలని కోరగా.. అందుకు తప్పనిసరిగా అలాగే చేస్తామంటూ నవ్వుకుంటూ పయ్యావుల అక్కడి నుంచి వెళ్ళిపోయారు.
Also Read : పోలీసులను బెదిరించిన పులివెందుల ఎమ్మెల్యే జగన్ !
అయితే..జగన్ ను అప్యాయంగా పలకరించి..ఆయన పక్కనే సీట్ కేటాయించాలని రఘురామ కోరడంపై ఇది ప్రేమా..? ర్యాగింగా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. జగన్ అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ ఎంపీగా ఉంటూనే నాటి సర్కార్ పై తీవ్ర ఆరోపణలు చేశారు.ఈ క్రమంలోనే రఘురామ అరెస్ట్.. తదనంతరం చోటు చేసుకున్న పరిణామాలతో ఇటీవలే ఆయన ఫిర్యాదుతో జగన్ పై కేసు కూడా నమోదైంది. ఈ క్రమంలోనే రఘురామ.. జగన్ తో సంభాషణ స్వీట్ ర్యాగింగ్ అని అంటున్నారు.