ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏమిటో.. ఆ పార్టీలో మిగిలి ఉన్న నేతలకే అర్థం కావడం లేదు. మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి పార్టీలో చేరడాన్ని సంక్రాంతి పండగలాగా సెలబ్రేట్ చేసుకున్నారు కానీ.. ఆయన వల్ల వచ్చే లాభమేమిటన్నదాన్ని విశ్లేషణ చేసుకుంటే.. నీరసం మాత్రమే వచ్చింది. ఆ తర్వాత బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి లాంటి నేతలు వచ్చి చేరినా.. వారి అండతో రాహుల్ గాంధీ పర్యటనను ఓ సారి పర్వాలేదనిపించుకునేలా జరిపినా… కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్ ఉందని.. చోటామోటా నేతలు కూడా నమ్మలేకపోతున్నారు. ఆ పార్టీలో మిగిలిన ఉన్న ఒకరు, ఇద్దరు నేతలు కూడా.. వేరే దారి చూసుకుంటున్నారు. చివరికి నాదెండ్ల మనోహర్ .. కాంగ్రెస్ తప్ప.. ఏ పార్టీ అయినా పర్వాలేదన్నట్లు.. వెళ్లి పవన్ కల్యాణ్ జనసేనలో చేరిపోయారు.
నాదెండ్ల భాస్కరరావు… కాంగ్రెస్ పెంచిన వ్యక్తి. ఇందిగాంధీని వ్యతిరేకించి.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఎన్టీఆర్‌ను… గద్దె దింపడానికి.. ఇందిరా గాంధీ నమ్మిన వ్యక్తి నాదెండ్ల భాస్కరరావు.. అప్పటి నుంచి ఆయన కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు. ఆయన కుమారుడు కూడా కాంగ్రెస్ వారసత్వాన్ని కొనసాగించారు. రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి.. ఓ సారి స్పీకర్‌గా కూడా వ్యవహరించారు. కాంగ్రెస్ పార్టీకి బద్దుడిగా ఉంటారని అందరూ అనుకున్నారు కానీ.. అనూహ్యంగా జనసేనలో చేరిపోయారు. వైసీపీ, టీడీపీ నుంచి ఆహ్వానం లేకపోవడం.. చేరుతానని చెప్పినా… స్పందించకకపోవడంతో… ఆయన జనసేనలో చేరిపోయారని చెబుతున్నారు. ఓ వైపు.. రాహుల్‌ను కలిసేందుకు రఘువీరా ఢిల్లీలో ఉన్న సమయంలోనే… ఈ జంపింగ్ చోటు చేసుకోవడంతో.. ఆయన నిరాశకు గురయ్యారు.
ఎక్కడ పోగొట్టుకున్నామో… అక్కడే వెతుక్కోవాలని రాహుల్చెప్పారని రఘువీరా.. చెప్పుకొచ్చారు. ఏపీలో పొత్తులపై రాహుల్దిశానిర్దేశం చేశారన్నారు. ఏపీలో కాంగ్రెస్‌కు మంచి స్పందన ఉందిని.. ఎన్నికల్లో ఒంటరిగా వెళ్లేందుకు సిద్ధం కావాలని సూచించారని చెప్పుకొచ్చారు. నాదెండ్ల నాదెండ్ల మనోహర్కాంగ్రెస్ను వీడటం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు.ఇతర పార్టీ నేతలను దరిచేరనీయమని పవన్చెప్పారు టీడీపీ, బీజేపీ, వైసీపీ చేసిందే పవన్‌చేస్తున్నారని విమర్శలు గుప్పించారు. రఘువీరా కొద్ది రోజుల క్రితం ఇంటింటి కాంగ్రెస్ పేరుతో హడావుడి చేశారు. మళ్లీ సైలెంటయ్యారు. మిగిలన నేతలు కూడా… తలోదారి చూసుకూంటే.. ఇక కాంగ్రెస్‌కు ఏపీలో అవసలు పోటీ విషయం కూడా ఆలోచిస్తుందేమో..?