రామ్ గోపాల్ వర్మ ఇప్పుడు వికారంగా తయారయ్యాడు గానీ ఒకప్పుడు ట్రెండ్ సెట్టర్. టాలీవుడ్, ఆమాటకొస్తే సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీ జెండాని బాలీవుడ్ పాతిన మొనగాడు. మామూలు సినిమాలు తీయలేదు వర్మ. వర్మ తీసిన క్లాసిక్స్ లో ‘రంగీలా’ ఒకటి. ఈ సినిమా వచ్చి పాతికేళ్ళు. ఈ సందర్భంగా ‘రంగీలా’ టీం ఓ రేడియా ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చింది. రామ్ గోపాల్ వర్మ, ఏఆర్ రెహమాన్, అమీర్ ఖాన్, జాకీ ష్రాఫ్.. ఈ ఇంటర్వ్యూ పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూ లో రెహమాన్ ఓ సంఘనట గుర్తు చేసుకున్నారు.
రెహ్మాన్ మాటల్లో..” నేను, రామూ సర్ బాలీవుడ్ కి కొత్త. ఆ రోజు ఆడియో వేడుక. నేను రాము సర్ ఈరోస్ కంపెనీ నుండి వేడుక జరిగిగే హోటల్ బయలుదేరాం. అమీర్ సర్ తో పాటు చాలా మంది బాలీవుడ్ సెలబ్రిటీలు అప్పటికే ఫంక్షన్ హాల్ లో వున్నారు. మేము హాల్ వైపు నడిచాం. ఇంతలో సెక్యూరిటి గార్డు మా ఇద్దరిని ప్రవేశద్వారం దగ్గర అడ్డుకున్నారు. మా ఇద్దరం ఒకరి మొహం ఒకరు చూసి నవ్వుకున్నాం. ఇంతలో ప్రొడక్షన్ టీంలో ఎవరో వ్యక్తి మమ్మల్ని గుర్తుపట్టాడు. సెక్యురిటీ దగ్గరకి వచ్చి.. ”వదలవయ్యా బాబు.. దర్శకుడు, సంగీతకారుడు లేకుండా ఆడియో ఫంక్షన్ ఏంటి ?” అని మమ్మల్ని లోపలకి తీసుకెళ్ళాడు. రామూ గారు నా అదృష్టం. ఆయన లేకపోతే బాలీవుడ్ నా బాణీ వినిపించలేకపోయేవాడిని” అని నాటి సంగతి గుర్తు చేసుకున్నారు రెహ్మాన్.
ఈ సినిమాతోనే బాలీవుడ్ లో అడుగుపెట్టారు వర్మ, రెహ్మాన్. రంగీలా రిలీజ్ కి ముందు ఎవ్వరికి తెలీదు. రిలీజ్ తర్వాత తెలియజెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు రెహ్మాన్ దేశం గర్వించదగ్గ ఆస్కార్ విజేత. ఇక వర్మ కూడా ఆయన ప్రపంచంలో ఆయనే విజేత.