మళ్ళీ లీవ్ పెట్టేసిన రాహుల్

సార్వత్రిక ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ పార్టీకి పూర్తిగా వ్యతిరేకంగా వచ్చిన తర్వాత కొన్నాళ్లపాటు రాహుల్ ఎక్కడా కనిపించలేదు. దాదాపుగా అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు. అతగాడి అజ్ఞాతవాసంపై అప్పట్లో అనేక ఊహాగానాలు, పుకార్లు షికారు చేశాయి. బీజేపీ కొట్టిన దెబ్బకు కుర్రాడు కంగుతిన్నాడంటూ ఛలోక్తులు విసురుకున్నవారూ లేకపోలేదు. ఆయనలోని రాజకీయ పరిణితిపై కూడా విమర్శలు తలెత్తాయి. టివీ ఇంటర్వ్యూల్లోనూ, బహిరంగసభల్లోనూ ఆయన మాటలు హాస్యాస్పదంగా మారాయి. రాత్రికీ పగలకీ తేడాతెలియకుండా ఓచోట మాట్లాడితే, మరో చోట మహిళల గురించి మాట్లాడుతూ, భ్రష్టాచార్ కీ, బలాత్కార్ కి మధ్య తేడా తెలియకుండా పదాలు ఉపయోగించడం వంటివి హాస్యప్రియులను కడుపుబ్బనవ్వించాయి. ఆయన ప్రసంగాల్లోని హాస్యంపై అనేక కథనాలు వచ్చాయి. అయితే ఈ మధ్యకాలంలో ఆయన ప్రసంగాల్లో పరిణితి కనిపిస్తుందని పార్టీ వర్గాలు సంతోషం వ్యక్తంచేస్తున్నాయి.

సోనియాగాంధీ ముద్దులబిడ్డ, రాకుమారుడుకాబట్టి ఆయన ఏమన్నా చెల్లిపోయింది. జాతీయ కాంగ్రెస్ పార్టీకి ఉపాధ్యక్షని హోదా వచ్చిన తర్వాత కూడా ఆయన శైలి మారలేదు. ఒక్కోసారి పార్టీని ఇరుకునపెట్టేవిధంగా కూడా మాట్లాడటంతో పార్టీపెద్దలు కంగారుపడాల్సివచ్చింది. పార్టీ ప్రచారకార్యక్రమాల కోసం ఏ రాష్ట్రానికి వెళ్ళినా పెద్దగా ఒరగబెట్టిందేమీలేదన్న విమర్శలను రాహుల్ మూటగట్టుకోవాల్సివచ్చింది. ఈ నేపథ్యంలో రాహుల్ సార్వత్రిక ఎన్నికల పరాజయాన్ని జీర్ణించుకోలేకపోయాడు. ఎన్నికల ఫలితాలు రాగానే కనిపించకుండా ఎటో వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఈఏడాది ఆరంభంలో మరోసారి రెండునెలలపాటు సెలవుపెట్టేశాడు 44ఏళ్ల రాహుల్.

ఇది గతం, ఇప్పుడు తాజాగా రాహుల్ మరోసారి సెలవుమీద వెళ్ళినట్లు సమాచారం. వ్యక్తిగత పనులపై బ్రిటన్ వెళ్ళారనీ, అయితే సరిగా ఎక్కడకు వెళ్ళారన్నది తమకు తెలియదని పార్టీ మీడియా ప్రతినిధి రణదీప్ సుర్జేవాలా అంటున్నారు.

ఒకపక్క బిహార్ ఎన్నికలు పెట్టుకుని రాహుల్ ఇలా హడావుడిగా సెలవుతీసుకోవడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మహాకూటమిలో చేరిన కాంగ్రెస్ అక్కడ మతపరమైన భావజాలమున్న పార్టీలను మట్టుపెట్టాలంటూ శంఖం పూరించారు. ఎన్నికల ప్రచారసభల్లో రాహుల్ ప్రధానంగా బీజేపీపై ధ్వజమెత్తుతున్నారు. మరీ ముఖ్యంగా మోదీపై విరుచుకుపడుతున్నారు. ఇప్పుడిప్పుడే రాజకీయంగా ఎదిగినట్లనిపిస్తున్న రాహుల్ అంతలో మాయమైతే అది తమ విజయంపై దెబ్బతీస్తుందన్న భయం కాంగ్రెస్ వర్గాల్లో కనిపిస్తోంది. ఈఏడాది ఆరంభంలో పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నప్పుడు కూడా రాహుల్ సెలవుపై ఎటో వెళ్ళిపోయాడు. ఫిబ్రవరి 23నుంచి ఏప్రిల్ 17వరకు ఎవ్వరికీ కనిపించనేలేదు.

రాహుల్ ఇలా సెలవుపెట్టిన ప్రతి సందర్బంలో అధికార పార్టీ అయిన బిజేపీ ఎంతోకొంత అదనపు ప్రయోజనం పొందుతూనే ఉంది. రాజకీయాల్లో తమను తరచూ విమర్శించే ఒక వ్యక్తి సెలవుమీద వెళ్లడం ఎవరికైనా అనందం కలిగించే అంశమేనన్నది బిజేపీ వర్గాల్లోని మాట. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి విజయం దక్కకపోగా కేవలం 44 సీట్లతో సరిపెట్టకోవాల్సివచ్చింది. ఆ తర్వాత ఎక్కడ అసెంబ్లీ ఎన్నికలు జరిగినా అత్తెసురు సీట్లతో సరిపెట్టుకోవాల్సివచ్చింది. దేశంలో కాంగ్రెస్ ఉనికి ప్రమాదంలో పడిన వేళ పార్టీభారంమోసే కీలకవ్యక్తి తరచూ సెలవులు పెట్టేయడం ఆ పార్టీ వర్గాల్లోనే కొరుకునపడని విషయంగా మారింది.

– కణ్వస

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

డి-ఏజింగ్… లాభమా? నష్టమా ?

సినిమాలో ఒక క్యారెక్టర్ బాల్యం, యవ్వనం, కౌమార, ప్రౌడ దశలని చూపించడం ఫిల్మ్ మేకర్స్ కి పెద్ద సవాల్. ఇందుకోసం హలీవుడ్ నుంచి కూడా మేకప్ మ్యాన్ లని దిగుమతి చేసుకునే వారు....

దువ్వాడ శ్రీనివాస్ ఇంట్లో దివ్వెల మాధురీ !

దువ్వాడ ఫ్యామిలీ డ్రామాలో కొత్త కొత్త ఎపిసోడ్లు ప్రారంభమవుతున్నాయి. కొద్ది రోజుల పాటు సైలెంట్ గా ఉంటానని చెప్పిన దివ్వెల మాధురీ.. ఒక్క సారిగా.. ఏకంగా దువ్వాడ శ్రీనివాస్ ఇంట్లోనే ప్రత్యక్షమయ్యారు. దువ్వాడ...

ఆ పడవలు నందిగం సురేష్ తాలూకానే !

ప్రకాశం బ్యారేజీకి వరద వస్తే ఈ మధ్య బోట్లు కొట్టుకు వస్తున్నాయి. బ్యారేజని డ్యామేజ్ చేస్తున్నాయి. అవి ఎలా వస్తున్నాయో తెలియడం లేదు. ఇప్పుడు మిస్టరీ బయటపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. వైసీపీ రంగులేసిన...

శభాష్ నిమ్మల… అభినందించిన నారా లోకేష్

భారీ వర్షానికి తోడు బుడమేరకు పడిన గండ్లు విజయవాడను ముంచేత్తాయి. కనీవినీ ఎరుగని స్థాయిలో వరద పోటెత్తడంతో విజయవాడ గత ఆరు రోజులుగా వరదలో నానుతోంది. బుడమేరుకు పడిన గండ్లు పూడ్చితేనే విజయవాడకు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close