దేశంలో ఉన్నదే మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వాలు. ఆయా రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులకు స్వేచ్చ ఇవ్వకుండా.. సూపర్ లీడర్లను పెట్టి పాలనపై ప్రభావం చూపేలా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. అదే సమయంలో రాష్ట్రాల్లో పరిస్థితులను అర్థం చేసుకోకుండా.. కుల రాజకీయాలు చేయాలని ఆయన ఒత్తిడి తెస్తున్నారు. తాజాగా రోహిత్ వేముల చట్టం తేవాలని ఆయన కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల సీఎంలకు లేఖలు రాశారు.
రాహుల్ లేఖ రాయాలి కానీ.. సీఎంలు పాటించకుండా ఉంటారా ?. తాను ఎదుర్కొన్న అవమనాలు, వివక్షతను గతంలో అంబేద్కర్ స్వయంగా చెప్పారు. ఇప్పటికీ దేశంలో అనేకమంది దళిత గిరిజన ఓబీసీ విద్యార్థులు అవమానాలు, వివక్షతను ఎదుర్కొంటున్నారు . ఇప్పటికైనా వీటికి ఫుల్స్టాప్ పెట్టాల్సిన అవసరం ఉంది. దళిత ఆదివాసి ఓబీసీ విద్యార్థుల కోసం రోహిత్ వేముల చట్టాన్ని చేయాలని లేఖలో రాహుల్ ఆదేశాల్లాంటి విజ్ఞప్తులు చేశారు.
ఇప్పటికే దేశంలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం అత్యంత పవర్ ఫుల్ గా ఉంది. అయినా కుల రాజకీయాల కోసం రాహుల్ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. రోహిత్ వేముల అనే విద్యార్థి HCUలో సూసైడ్ చేసుకున్నాడు. కుల వేధింపులని ప్రచారం చేశారు కానీ..ఆ విద్యార్థి కుటుంబ సమస్యల కారణంగా చనిపోయాడన్న వాదన ఉంది. అప్పట్లో రాహుల్ ఈ రోహిత్ వేముల మరణం చుట్టూ చాలా రాజకీయాలు చేశారు. ఇప్పుడు మళ్లీ అదే చేస్తున్నారు.