తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నిస్తేజంలో ఉంది. ఇప్పుడు.. ప్రతిపక్షంగా తన పోరాటాన్ని మానుకుంది. తెలంగాణలో ఏం జరిగినా రాజకీయంగా స్పందించడం మానేశారు. ముంగిట… పార్లమెంట్ ఎన్నికలు ఉండటంతో… పోటీకి సీనియర్లు కూడా జంకుతున్నారు. ఇలాంటి సమంయలో.. రాహుల్ గాంధీ.. తెలంగాణలో బహిరంగసభ ఏర్పాటు చేశారు. వారికి పార్లమెంట్ ఎన్నికలపై నమ్మకం కలిగించేందుకు ప్రయత్నిస్తున్నారు. శంషాబాద్ క్లాసిక్ కన్వెన్షన్ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన సభలో ఆయన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించ బోతున్నారు. పార్లమెంట్ ఎన్నికల్ని ఎలా ఎదుర్కోవలన్నది దిశా నిర్దేశం చేయబోతున్నారు.
కాంగ్రెస్ పార్టీ తొలుత పార్టీ 2 లక్షల మంది తో భారీ సభ నిర్వహించాలని అనుకున్నారు. కానీ బాధ్యత తీసుకోవడానికి ఏ నాయకుడు సిద్ధపడలేదు. పైగా.. వరుసగా.. ఎమ్మెల్యేలు.. టీఆర్ఎస్లో చేరుతున్నారు. గ్రూపుల కారణంగా.. ఒకరికి ఒకరు సహకరించే పరిస్థితి లేదు. అందుకే చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ పరిధికి సభను కుదించారు. పార్టీ ముఖ్య నాయకులు..డీసీసీల ను ఆహ్వానించారు. చేవేళ్లలో.. ఎంపీగా పోటీ చేయనున్న ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి మొత్తం బాధ్యతను తీసుకున్నారు. ఈ సారి కనీసం.. సగం పార్లమెంట్ స్థానాలైనా గెలుచుకోవాలని రాహుల్ గాంధీ భావిస్తున్నారు. పార్టీ అభ్యర్థుల ప్రకటన కూడా ఇప్పటికే కొంత కొలిక్కి వచ్చినట్టు తెలుస్తోంది. ఇప్పటి వరకు 10 మంది అభ్యర్థుల పేర్లు కొలిక్కి వచ్చాయని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.
ఎన్నికల్లో ఓటమి తర్వాత…దాదాపుగా అన్ని స్థాయిల నేతలు మీడియాకు దూరంగా ఉంటున్నారు. తమకు బలం ఉన్న ఎమ్మెల్సీ సీటును.. గెలుచుకోవడానికి కూడా వ్యూహాత్మకంగా వ్యవహరించలేకపోయారు. చివరికి కోమటిరెడ్డి బ్రదర్స్‌కు నమ్మిన బంటులా ఉన్న… చిరుమర్తి లింగయ్య కూడా.. టీఆర్ఎస్లో చేరడం.. అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది.