మేడ్చల్ సభలో రాహుల్ గాంధీ.. పెద్దగా ప్రసంగించలేదు. తన తల్లి ప్రసంగమే హైలెట్ కావాలనుకున్న ఆయన… కొంత సేపు మాత్రమే… మాట్లాడారు. అయితే ఆ మాటల్లోనూ… తన లక్ష్యాన్ని స్పష్టగనే చెప్పారు. తన ఎజెండా ఏమిటో ఆయన తన చిన్న స్పీచ్ లోనే వెల్లడించారు. నాలుగున్నరేళ్ల టీఆర్ఎస్ పాలన వైఫల్యాలను ఆయన కుండ బద్దలు కొట్టినట్లుగా ప్రజల ముందు ఉంచారు. ఓ కుటుంబం కోసం.. తెలంగాణ మొత్తం కష్టాలు పడుతోందన్న వాస్తవాన్ని ప్రజల ముందు ఉంచేందుకు… రాహుల్ గాంధీ తీవ్రంగా ప్రయత్నించారు. ఇప్పటి వరకు తెలంగాణ ప్రభుత్వంలో ఎవరికీ అధికారాల్లేవు. కేబినెట్ మంత్రులయినా… ప్రగతి భవన్ నుంచి వచ్చే ఆదేశాల మేరకే నడుచుకోవాలి. అయితే కేటీఆర్ లేకపోతే కవిత అన్నట్లుగా.. పాలన నడిచిందనే అభిప్రాయం ప్రజల్లో ఉంది.
దీన్నే రాహుల్ గాంధీ.. ప్రభావ వంతంగా ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ప్రయత్నించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన జరపబోయే పర్యటనల్లోనూ ఇదే కనిపించనుంది. నాలుగున్నరేళ్లలో.. తెలంగాణ ప్రభుత్వ వైఫల్యాలను..స్పష్టంగా వివరించబోతున్నారు. నాలుగున్నరేళ్లలో భవిష్యత్ తరాల కోసం..చేసిన ప్రయత్నం ఒక్కటీ లేదనే వాస్తవాన్ని ప్రజల ముందు ఉంచే వ్యూహాన్ని రాహుల్ గాంధీ అమలు చేయనున్నారు. రాబోయే ప్రజాకూటమి ప్రభుత్వం…. కుటుంబం కోసం పని చేయదని ప్రజల కోసమే పని చేస్తుందని.. ముందుగానే క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నారు.
సీట్ల పంపకాల్లో తేడాలున్నప్పటికీ..అసంతృప్తికి గురైనప్పటికీ.. కోదండరాం … కూడా.. తెలంగాణకు ఏది మంచిదైతే.. అది చేసేందుకు ఏమాత్రం సందేహించలేదు.. టీఆర్ఎస్ పెట్టే డబ్బుల విషయాన్ని నేరుగా తులాభారం ద్వారా చెప్పి.. ప్రజలను ఆకట్టుకున్నారు. ప్రచారబరిలోకి దిగే ముందు ప్రజాకూటమి.. ఓ బలమైన ఆరంభాన్ని అంది పుచ్చుకుందనుకోవాలి. ఈ ఉత్సాహాన్ని కింటిన్యూ చేస్తుందో.. లేదో..రాబోయే ప్రచారసభల్లో తేలిపోనుంది.