కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీకి రిజర్వేషన్ల ఫోబియా సోకింది. ఆయన నిన్నటికి టెక్స్ టైల్ పరిశ్రమలో ఓబీసీలకు గుర్తింపు అది అని ప్రశ్నించారు. ఆయన టెక్స్ టైల్ ఇండస్ట్రీని పరిశీలించారు.. అందుకే అక్కడ అలాంటి మాట మాట్లాడారు. నిజానికి ఆయన ఎక్కడికి వెళ్లినా ఇదే పాట పాడుతున్నారు. ఏ రంగం విషయంలో అయినా ఆయన అదే వాదన వినిపిస్తున్నారు. ఆయన తీరు చూస్తూంటే.. అందాల పోటీల్లోనూ రిజర్వేషన్లు ప్రకటించేలా ఉన్నామన్న సెటైర్లు వినిపిస్తున్నాయి.
బీజేపీని గెలవాలంటే కులం తప్ప మరో ఆయుధం లేదన్నట్లుగా రాహుల్ తీరు ఉంది. గతంలో ఆయన మిస్ ఇండియా పోటీల్లో ST, SC, మైనారిటీ వాళ్ళు ఎందుకు ఉండట్లేదని ప్రశ్నించారు. తాను మిస్ ఇండియా లిస్ట్ తీసాను అందులో ఒక్క దళిత్, ఆదివాసి, ఓబీసీకి సంబంధించిన మహిళా ఉండరు.. బాలీవుడ్లో సైతం 90 శాతం వీళ్ళు ఎవ్వరు ఉండరని తేల్చారు. అసలు రాహుల్ కు ఇలాంటి ఆలోచనలు ఎందుకు వస్తున్నాయో .. కాంగ్రెస్ నేతలకు అయినా అర్థం అవుతుందో లేదో..?
అందాల పోటీల్లో కులం ఏమిటో.. మతం ఏమిటో ఆయనకే తెలియాలి. ఇది కాంగ్రెస్ కు మంచిదో కాదో కానీ.. ఒక వేళ అలాంటి పరిస్థితి ఉందంటే కారణం కాంగ్రెస్ పార్టీనే. దేశాన్ని కీలక దశలో చేతుల్లోకి తీసుకుని ప్రజల్ని ఇంకా పథకాల కోసం ఎదురుచూసే స్థాయిలోనే ఉంచింది. ఇప్పుడు కులం పేరుతో అవకాశాలు అందివ్వాలని చిచ్చు పెడుతోంది. కొన్ని రంగాలు కులాలు చూడవు. టాలెంట్ మాత్రమే నిలబడుతుంది. దాదాపుగా అన్ని రంగాలు అంతే. అన్ని వర్గాల్లో అలాంటి టాలెంట్ ను పెంచే ప్రయత్నాలు చేయని కాంగ్రెస్ పార్టీదే అతి పెద్ద తప్పు. తాము చేసిన తప్పును ఇప్పుడు రాజకీయం కోసం వాడుకుంటున్నారు రాహుల్.