అధికారంలోకి రావాలంటే దక్షిణాదిన గెలవడం ఎంత ముఖ్యమో గుర్తించిన రాహుల్ గాంధీ తన మకాంను మార్చాలని అనుకుంటున్నట్లుగా తెలుస్తోంది. హైదరాబాద్ లో శాశ్వత నివాసం ఏర్పాటు చేసుకోవాలని.. నిర్ణయించుకున్నారని అందు కోసం ఇప్పటికే ఇల్లును వెదుకుతున్నారని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. కాంగ్రెస్ పార్టీకి బోయిన్ పల్లిలో ఎనిమిది ఎకరాల స్థలం ఉంది. అక్కడ శాశ్వత గెస్ట్ హౌస్ నిర్మిస్తే ఎలా ఉంటుందా అన్న ఆలోచన కూడా చేస్తున్నారు. ఆ స్థలంలో సిడబ్ల్యూసీ సమావేశాల సందర్భంగా .. హైదరాబాద్ కు వస్తున్న సోనియా, రాహుల్ .. నాలెడ్జ్ సెంటర్ నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. అక్కడే ఇల్లు కూడా కడితే ఎలా ఉంటుందా అని ఆలోచిస్తున్నారు.
రాహుల్ గాంధీ హైదరాబాద్ లో నివాసం ఉంటే… ఆ ప్రభావం దక్షిణాది మొత్తం ఉటుందని కాంగ్రెస్ వర్గాలు గట్టిగా నమ్ముతున్నాయి. అందుకే రాహుల్ నిర్ణయాన్ని సమర్థిస్తున్నారు. ముఖ్యంగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మేలు జరుగుతుందని అంచనా వేస్తున్నారు. ఇప్పటికి జాతీయ నాయకులు అంటే ఢిల్లీ అనుకుంటారు. కానీ రాహుల్ ఇప్పుడు స్థానం మారుస్తున్నారు. రాహుల్ కు ఢిల్లీలో ఇంటి సమస్య ఉంది. ఆయనపై అనర్హతా వేటు పడిన తర్వాత వెంటనే ఇల్లు ఖాళీ చేయించారు. దాంతో ఆయనకు ఎక్కడ ఉండాలన్న సమస్య ఏర్పడింది.
ఇప్పుడు హైదరాబాద్ లో నివాసాన్ని ఏర్పాటు చేసుకుంటే కాంగ్రెస్ పార్టీ ఎదుర్కొంటున్న కొన్ని సవాళ్లకు పరిష్కారం లభిస్తుదంని అనుకుంటున్నారు. టీ పీసీసీ కీలక నేత ఇప్పటికే రాహుల్కు సరిపోయేలా … సెక్యూరిటీ పటిష్టంగా ఉండేలా కొన్ని ఇళ్లను ఎంపిక చేసి.. రాహుల్ పరిశీలనకు పంపారని అంటున్నారు. రాహుల్ కు నచ్చితే.. . ఈ నెలలోనే ఆయన హైదరాబాద్ కేంద్రంగా రాజకీయాలు ప్రారంభిస్తారని అంటున్నారు