ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది భారతీయ జనతా పార్టీని సింగిల్ పాయింట్ అంజెడాతో కొట్టాలని.. కాంగ్రెస్ పార్టీ ఓ ప్లాన్ చేసుకుంది. ఆ సింగిల్ పాయింట్ ఎజెండా… రాఫెల్ డీల్. కాంగ్రెస్ పార్టీ పతనాన్ని ఒకప్పుడు శాసించిన భోఫోర్స్ స్కామ్ మాదిరిగా ఇప్పుడు రాఫెల్‌ను బీజేపీపైకి వదలాలని కాంగ్రెస్ పార్టీ అత్యున్నత స్థాయిలో నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ను కూడా రాహుల్ గాంధీ నియమించారు. ఈ టాస్క్ ఫోర్స్‌కు తెలంగాణ కాంగ్రెస్ నేత జైపాల్ రెడ్డి నేతృత్వం వహిస్తారు.
అవినీతి మరకలు అంట లేదని చెబుతున్న బీజేపీ .. ఇప్పుడు రాఫెల్ విషయంలో సూప్‌లో పడింది. డీల్‌ని… .డీల్‌లో భాగంగా వినామాలను కొనుగోలుకు కుదుర్చుకున్న ఒప్పందం ధరను ఎందుకు బయటపెట్టడం లేదని కాంగ్రెస్ పార్టీ చాలా రోజులుగా ప్రశ్నిస్తోంది. అది అత్యంత కాన్ఫిడెన్షియల్ సమాచారం అని చెబుతోంది కానీ.. దానికి సంబంధించి… అవినీతి జరిగిందని చెప్పడానికి పక్కా సాక్ష్యాలు ఉన్నాయని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. కష్టాల్లో ఉన్ని రిలయన్స్ వారసుడు అనిల్ అంబానీ కంపెనీకి అప్పనంగా.. కొన్ని వేల కోట్ల ఆయాచిత లబ్ది చేకూర్చేలా ఒప్పందం చేసుకున్నారని… అత్యధిక రేట్లను విమానాలు కొనుగోలు చేశారని కాంగ్రెస్ చెబుతోంది. బీజేపీ దీన్ని సమర్థంగా తిప్పికొట్ట లేకపోతోంది. అందుకే కాంగ్రెస్ పార్టీ ఈ అంశాన్ని మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయించుకుంది. నియోజకవర్గ కేంద్రాల్లో సభలు సమావేశాలు పెట్టాలని నిర్ణయించింది.
కాంగ్రెస్ పార్టీ ఎన్నికలే టార్గెట్ గా .. రాఫెల్ యుద్ద విమానాల స్కాంని.. భారతీయ జనతా పార్టీకి సూటిగా గురి పెట్టుకుని కూర్చుంది. సమయం చూసుకుని.. గత ఎన్నికల సమయంలో.. ఎలాంటి అవినీతి ఆరోపణలతో… బద్నాం చేసి.. ఓటమికి కారణమయ్యారో.. బీజేపీకికి కూడా కచ్చితంగా అలాంటి ట్రీటే ఇవ్వాలని కాంగ్రెస్ పట్టుదలతో ఉంది. కాంగ్రెస్ గురి కుదిరితే… అధికారం వచ్చి పడుతుంది. లేకపోతే… పోయేదేమీలేదు.