యూరప్ పర్యటనలో ఉన్న రాహుల్ గాంధీ తో లండన్ పర్యటనకు అని చెప్పి వెళ్లిన జగన్ రెడ్డి భేటీ అయినట్లుగా ప్రచారం జరుగుతోంది. జగన్ రెడ్డి పది రోజల పర్యటనకు లండన్ వెళ్లారు కానీ ఆయన ఎక్కడ ఉన్నారో ఎవరికీ తెలియదు. చిన్న ఫోటో కూడా బయటకు రాలేదు. అత్యంత రహస్యంగా జరుగుతున్న పర్యటనలో రాహుల్ గాంధీతో భేటీ ఉందన్న అభిప్రాయం జాతీయ మీడియా వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
వచ్చే ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీకి మద్దతిస్తామని ఆయన ఇప్పటికే కొంత మంది ద్వారా రాయబారం పంపారని అంటున్నారు. ఇప్పుడు యూరప్ లో ప్రత్యక్షంగా కలిసి ఈ అంశంపై చర్చలు జరిపారని.. జాతీయ మీడియా వర్గాలు చెబుతున్నాయి. కాంగ్రెస్ పార్టీలో షర్మిల విలీనం ఆపేందుకు.. ఆమె కాంగ్రెస్ లో చేరితే తనకు చాలా సమస్య అవుతుందని.. షర్మిల పార్టీ విలీనం ఆపితే.. వచ్చే ఎన్నికల తర్వాత మద్దతుగా ఉంటానని హామీ ఇచ్చినట్లుగా చెబుతున్నారు.
ఈ అంశంపై ఇప్పటికే ఏపీలో.. జాతీయ మీడియాలో విస్తృత ప్రచారం జరుగుతోంది. కానీ ఇంత వరకూ ఆ పార్టీ ముఖ్య నేతలు కానీ.. ఇతర నేతలు కానీ ఖండించలేదు. మామూలుగా కాంగ్రెస్ పార్టీ అధినేత సోనియా, రాహుల్ లపైనా కూడా వైసీపీ నేతలు దారుణమైన భాష ప్రయోగించేవారు. విజయసాయిరెడ్డి ఎన్నో సార్లు రాహుల్ ను టార్గెట్ చేశారు. కానీ ఇటీవల అంతా సైలెంట్ అయ్యారు. దీంతో.. జగన్ రెడ్డి కాంగ్రెస్ కు దగ్గరవుతున్న సూచనలు కనిపిస్తున్నాయని స్పష్టం అవుతోందని రాజకీయవర్గాలు ఓ అంచనాకు వచ్చేశాయి.