‘అందాల రాక్షసి’లాంటి సినిమాతో హీరోగా మెప్పించాడు రాహుల్ రవీంద్రన్. తనలో ఓ దర్శకుడూ ఉన్నాడన్న సంగతి `చిలసౌ`తో తెలిసొచ్చింది. క్లాస్ ఆడియన్స్ని `చిలసౌ` అమితంగా ఆకట్టుకుంది. ఆ సినిమాతోనే నాగార్జునతో `మన్మథుడు 2` తీసే ఛాన్స్ వచ్చింది. ఆ అవకాశాన్ని రాహుల్ సరిగా వాడుకోలేకపోయాడు. `మన్మథుడు 2` డిజాస్టర్ అవ్వడంతో, దర్శకుడిగా తన ప్రయాణానికి అనుకోని కుదుపు వచ్చింది. ఇప్పుడు ముచ్చటగా మూడో ప్రయత్నం చేయబోతున్నాడట. ఇటీవల గీతా ఆర్ట్స్ లో ఓ కథ వినిపించాడట రాహుల్. ఇది లేడీ ఓరియెంటెడ్ సబ్జెక్ట్ అని తెలుస్తోంది. ఓ స్టార్ హీరోయిన్ ఉంటేనే.. ఈ కథకు న్యాయం జరుగుతుందని రాహుల్ భావిస్తున్నాడు. గీతా ఆర్ట్స్ తలచుకుంటే… ఎవరినైనా రంగంలోకి దించగలదు. సమంత తో రాహుల్ కి మంచి స్నేహం ఉంది. `చిలసౌ`, `మన్మథుడు 2` సినిమా విషయంలో సమంత చాలా హెల్ప్ చేసింది. `మన్మథుడు 2` ప్రాజెక్ట్ సెట్ చేసింది కూడా సమంతే. అన్నీ కలిసొస్తే సమంతే.. ఈ సినిమాలో హీరోయిన్ కావొచ్చు. మరి ఏం జరుగుతుందో చూడాలి.