కథానాయకుడిగా రాహుల్ రవీంద్రన్ ఏ మాత్రం ప్రభావం చూపించలేకపోయాడు. ‘అందాల రాక్షసి’ మినహా.. చెప్పుకోదగిన సినిమా అతని ఖాతాలో లేకుండా పోయింది. ఆమధ్య శ్రీమంతుడులో ఓ చిన్న పాత్రలో కనిపించాడు. ఆ తరవత పూర్తిగా నటనకు దూరమై దర్శకత్వం వైపు దృష్టి పెట్టాడు. తన సినిమా `చి.ల.సౌ` ఇప్పుడు విడుదలకు సిద్ధమైంది. సుశాంత్ కథానాయకుడిగా నటించిన ఈ సినిమా అన్నపూర్ణ స్డూడియోస్ చేతుల్లోకి వెళ్లి.. పెద్ద సినిమాగా మారింది. అంతేకాదు… ఇప్పుడు అన్నపూర్ణ స్డూడియోస్‌లో వరుసగా రెండు సినిమాలు చేసే అవకాశం దక్కించుకున్నాడు. ‘చిలసౌ’ చూసి నాగచైతన్య, నాగార్జున బాగా ఇంప్రెస్ అయ్యార్ట. అందుకే రవీంద్రన్ రెండోసినిమా, మూడో సినిమా అన్నపూర్ణ బ్యానర్ లో చేసేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. అయితే రవీంద్రన్ ఇంత వరకూ కథలేం చెప్పలేదు. ‘చిలసౌ’ హడావుడి అయిపోయాక… కథలు వినిపిస్తే, ఆ కథలు ఎవరికి సెట్ అవుతాయో చూసి, అప్పుడు హీరో ఎవరన్నది డిసైడ్ చేస్తార్ట. చైతూ ఇప్పటికే బిజీగా ఉన్నాడు. అఖిల్ మూడో సినిమా సెట్స్‌పై ఉంది. కాబట్టి.. బయటి హీరోతోనే ఈ సినిమా ఉండే అవకాశాలున్నాయి.