కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ… సహాయ నిరాకరణ పేరుతో అసెంబ్లీ ఎన్నికలను బహిష్కరించాలనే ఆలోచన చేస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ .. ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోకపోవడానికి ప్రధాన కారణం ప్రజలు.. ఓటర్లు కాదని.. కచ్చితంగా ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్లేనని ఆయన నమ్ముతున్నారు. దీనికి సంబంధించి కొంత డేటా ఆయన దగ్గర ఉండటంతో… అసలు బీజేపీ ప్రభుత్వంపై పోరాటం చేయడం కన్నా.. ఈవీఎంలపై పోరాటం చేయడం బెటరని నిర్ణయించుకున్నట్లుగా ప్రచారం జరుగుతోంది.
ఈవీఎంల వల్లే బీజేపీ గెలిచిందని రాహుల్ నమ్మకం..!
రాహుల్ గాంధీ.. ఈవీఎంలపై… తన పోరాటం ప్రజల్లోకి వెళ్లేలా కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారని చెబుతున్నారు. అందులో మొదటి.. ఎన్నికల బహిష్కరణ. త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలను బహిష్కరించాలని.. బ్యాలెట్లతో ఎన్నికలు పెట్టాలనే డిమాండ్ తో… ఈ ప్రయత్నం చేయాలని.. నిర్ణయించుకున్నట్లుగా కాంగ్రెస్‌లో ప్రచారం జరుగుతోంది. దీంతోనే వదిలి పెట్టకుండా.. దేశవ్యాప్తంగా కలసి వచ్చే పార్టీలో భారీ ఉద్యమాన్ని నిర్మించాలని రాహుల్ గాంధీ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. ఈవీఎంలతోనే… బీజేపీ గెలిచిందని… అవి లేకపోతే.. ప్రజాతీర్పు మరోలా ఉంటుందని రాహుల్ గట్టిగా నమ్ముతున్నారు.
బ్యాలెట్‌తో నిర్వహించకపోతే అసెంబ్లీ ఎన్నికల బహిష్కరణ..!
రాహుల్ గాంధీ ఆలోచనలపై.. కాంగ్రెస్‌లోనే… కలకలం రేగింది. అనేక మంది నేతలు… ఈ నిర్ణయం సరి కాదని.. వాదిస్తున్నారు. ఈవీఎంలపై.. ఆరోపణలు చేయడం కన్నా.. ప్రజల్లోకి వెళ్లి పోరాడదామని సూచిస్తున్నారు. అయితే.. సోనియా గాంధీకి కూడా.. ఈవీఎంలపై అనుమానాలున్నాయి. కొద్ది రోజుల కిందట.. మీడియాతో మాట్లాడుతూ.. ఆమె కూడా… ఎన్నికల ఫలితాలపై అనుమానాలు వ్యక్తం చేశారు. అయితే.. ఈవీఎంలు తీసుకొచ్చిందే కాంగ్రెస్ పార్టీ కాబట్టి.. ఆమె వాటిని వ్యతిరేకించలేని పరిస్థితి ఉంది. అందుకే.. రాహుల్ సహాయనిరాకరణ ఉద్యమంపై.. ఆమె అంత సానుకూలంగా లేరన్న భావన కాంగ్రెస్ వర్గాల్లో ఉంది.
కాంగ్రెస్‌లోనూ దొరకని మద్దతు..! ముందడుగు వేస్తారా..?
బ్యాలెట్ ఎన్నికల కోసం రాహుల్ గాంధీ పోరాటం ప్రారంభిస్తే… కచ్చితంగా అది ఆయన ఒంటరిగానే ప్రారంభించాలి. నిజానికి.. ఈవీఎంలు వచ్చిన తర్వాత ఎన్నికల ఫలితాలపై విశ్వసనీయత లేకుండా పోయింది. గెలిచిన వాళ్ల వైపు.. అనుమానంగా చూడాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఈ క్రమంలో… రాహుల్ గాంధీ… గట్టిగా నిలబడితే.. ఆయన పోరాటానికి మద్దతు లభించే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే… 21 పార్టీలు ఈవీఎంలకు వ్యతిరేకంగా పోరాడుతున్నాయి. అన్నీ కలసి వస్తే.. పోరాటానికి మద్దతు పెరుగుతుంది. ప్రజలు కూడా.. సపోర్ట్ చేస్తే కేంద్రం దిగిరాక తప్పదు. అయితే.. అప్పటి వరకూ రాహుల్ గాంధీ వెటకారాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.