దుబాయ్‌లో ఐపీఎల్ జరగడానికి రంగం సిద్ధం అవుతున్న తరుణంలో… చెన్నైకి దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. చెన్నై సూపర్ కింగ్స్ బృందంలో ఒకరిద్దరు కీలక సభ్యులకు కరోనా పాజిటీవ్ అని తేలడంతో… చెన్నై టీమ్ లో కలలకం రేగింది. దాంతో ప్రాక్టీస్ సెషన్స్‌కి దూరమై.. క్వారెంటైన్లో బిజీ అయ్యారు చెన్నై ఆటగాళ్లు. ఇప్పుడు మరో ఎదురు దెబ్బ తగిలింది. చెన్నై సూపర్ కింగ్స్‌లో కీలక ఆటగాడైన రైనా ఈ టోర్నీకి దూరమయ్యాడు. తన వ్యక్తిగత కారణాల వల్ల రైనా ఈ టోర్నీలో ఆడడం లేదని సూపర్ కింగ్స్ యాజమాన్యం తెలిపింది. దుబాయ్‌లో ఉన్న రైనా.. ఇప్పుడు సడన్ గా చెన్నై బయలు దేరిపోతున్నాడు. ఇటీవలే.. అంతర్జాతీయ క్రికెట్‌కు రైనా వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. కనీసం ఐపీఎల్ లో అయినా రైనా ఆటని చూడాలని అభిమానులు ఆశించారు. కానీ ఇంతలోనే… కోలుకోని షాక్ తగిలింది.