తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కేసీఆర్ హయాంలోని రైతు భరోసా పథకాన్ని కొనసాగించాలని నిర్ణయం తీసుకుంది. సంక్రాంతి తర్వాత రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధులు వేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. మారీచుడు వచ్చి అడ్డుకున్నా రైతు భరోసా ఆగదని ప్రకటించారు. ఇప్పటికే భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో రైతుభరోసాపై కేబినెట్ సబ్‌కమిటీ వేశామని గుర్తు చేశారు. డిసెంబర్లో జరిగే అసెంబ్లీ సమావేశాల్లో చర్చించి రైతు భరోసా వేస్తామని ప్రకటించారు.
రైతులకు రూ. రెండు లక్షల వరకూ రుణమాఫీ చేశారు. అలాగే సన్న వడ్లకు రూ. ఐదు వందల వరకూ బోనస్ ఇస్తున్నారు. ఈ కారణంగా రైతు భరోసా అమలుకు ప్రభుత్వం ఇబ్బందులు ఎదుర్కొంటోంది. మరో వైపు రైతులు ఈ పథకం కోసం ఎదురుచూసేలా వ్యూహాత్మకంగా బీఆర్ఎస్ పదే పదే రైతు భరోసా పథకాన్ని గుర్తు చేస్తోంది. దీంతో ఈ పథకాన్ని జనవరిలో అమలు చేయాలని రేవంత్ రెడ్డి నిర్ణయించుకున్నారు. నిజంగా పంటలు పండించే రైతులకు మాత్రమే ఇచ్చే అవకాశం ఉంది.
గతంలో ప్రతి ఎకరానికి ఇచ్చేవారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకునేవారు.. భూస్వాములకు కూడా వచ్చేది . ఈ అంశంపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. కౌలు రైతులకు ఇవ్వకపోవడం వంటి సమస్యలు కూడా ఉన్నాయి. వీటిని అసెంబ్లీలో చర్చి.. కేవలం రైతులు వ్యవసాయం చేసే వారికి మాత్రమే ఈ రైతు భరోసా పెట్టుబడి సాయం అందించే అవకాశం ఉంది.