ఏపీ లిక్కర్ స్కాం కీలక సూత్రధారి రాజ్ కసిరెడ్డిని హైదరాబాద్ ఎయిర్ పోర్టు వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయన దుబాయ్ నుంచి వస్తున్నట్లుగా తెలియగానే సిట్ అధికారులు ఎయిర్ పోర్టు వద్ద మకాం వేశారు. బయటకు రాగానే అరెస్టు చేశారు. విజయవాడ తరలిస్తున్నారు.
నిజానికి కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి పై లుకౌట్ నోటీస్ ఉంది. ఆయన విదేశాలకు పోయే అవకాశం లేదని పోలీసులు చెబుతూ వస్తున్నారు. కానీ ఆయన పోలీసుల కన్నా తెలివిగా ఉన్నారు. రాజేష్ రెడ్డి అనే పేరుతో పాస్ పోర్టు తీసుకున్నారు. ఆ పాస్ పోర్టుతో పోలీసులు వెదుకుతున్న సమయంలోనే దేశం నుంచి జంప్ అయ్యారు. ఏ లుకౌట్ నోటీసు ఆయనను అడ్డుకోలేకపోయిది. ఈ విషయం పోలీసులకు తెలిసింది. కానీ తెలియనట్లే ఉన్నారు.
ఈ రాజేష్ రెడ్డి అలియాస్ రాజ్ కసిరెడ్డి .. దుబాయ్ నుంచి వస్తున్నాడని తెలియగానే పోలీసులు క్యాంప్ వేశారు. ఎవరికీ సమాచారం ఇవ్వలేదు. సిట్ ఎదుట హాజరవుతానని హైకోర్టులో రిలీఫ్ రాక ముందే సమాచారం ఇచ్చాడు. కానీ పోలీసులు అంత చాన్స్ ఇవ్వదల్చుకోలేదు. నేరుగా పట్టుకుని తరలిస్తున్నారు. లిక్కర్ కేసులో ఆయనను అరెస్టు చూపించే అవకాశాలు ఉన్నాయి.