శిల్పాషెట్టి భర్తగా సెలబ్రిటీ హోదా పొందిన రాజ్ కుంద్రా బిజినెస్ ఇప్పుడు బాలీవుడ్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఆయన సంపాదన… ఓ రేంజ్లో ఉంది.. అది ఆషామాషీ రాకెట్ కాదని ముంబై పోలీసులు ఓ అంచనాకు వచ్చారు. “హెచ్” పేరుతో క్రియేట్ చేసుకున్న ఓ వాట్సాప్ గ్రూప్ ద్వారా ఆయన మొత్తం రాకెట్ నడిపాడని ముంబై పోలీసులు మీడియాకు లీక్ చేశారు. ఆయన తన పోర్న్ వీడియోల మార్కెటింగ్ కోసం సొంతంగా హాట్ షాట్స్ అనే యాప్ కూడా క్రియేట్ చేశారు. దాని ఆధారంగానే బిజినెస్ చేశారు.
రాజ్ కుంద్రాతో కలిసి మొత్తం ఐదుగురు ముఠాగా ఏర్పడి పోర్న్ వీడియోలు తీయడం.. వాటిని యాప్స్‌లో సర్క్యూలేట్ చేయడం.. అత్యధిక వ్యూస్ వచ్చేలా మార్కెటింగ్ వ్యూహాలకు పాల్పడటం అన్నీ .. రాజ్ కుంద్రా స్వయంగా పర్యవేక్షించారని పోలీసులు చెబుతున్నారు. ఆయన కొన్ని కోట్ల రూపాయలు ఈ వీడియోల ద్వారా సంపాదించారని అంటున్నారు. ఈ పోర్న్ వీడియోలను ఆయన ఎలా క్రియేట్ చేశారన్నదానిపైనా పోలీసులు కన్నేశారు. సినిమాలపై ఆశతో.. వెబ్ సిరీస్‌లలో చాన్స్ ల పేరుతో ఔత్సాహిక నటీమణులకు రాజ్ కుంద్రా గ్యాంగ్ వల వేసి.. పోర్న్ వీడియోలు చిత్రీకరించేవారని అంటున్నారు. వివియాన్ పేరుతో ఉన్న కంపెనీ తరపునే లావాదేవీలు నిర్వహించేవారు. ఈ కంపెనీలో పోలీసులు జరిపిన సోదాల్లో పెద్ద ఎత్తున విదేశీ మారక ద్రవ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు.
ఈ వ్యవహారంలో శిల్పాషెట్టి పేరు ఇంత వరకూ బయటకు రాలేదు. కానీ ఆమె పేరు మాత్రం మార్మోగిపోతోంది. శిల్పాషెట్టి భర్తగానే రాజ్ కుంద్రా అందరికీ తెలుసు. బాలీవుడ్లో ఒక్క రాజ్ కుంద్రానే కాదని.. ఇంకా చాలా మంది ఈ తరహా బిజినెస్‌లో ఉన్నారని ప్రచారం జరుగుతోంది. వీరంతా ప్రముఖులేనని.. ప్రత్యేకంగా యాప్స్ కూడా… క్రియేట్ చేశారని అంటున్నారు. ఈ వ్యవహారంపై ముంబై పోలీసులు సుదీర్ఘంగా విచారణ జరుపుతున్నారు. ఇప్పుడు స్పష్టమైన సాక్ష్యాలు లభించడంతో అరెస్ట్ చేశారు. సుశాంత్ కేసు లాగా.. ఈ వ్యవహారం కూడా.. బాలీవుడ్ మొత్తానికి పాకే అవకాశం ఉందని తెలుస్తోంది.