హైదరాబాద్: పబ్లిసిటీకోసం ట్విట్టర్లో పిచ్చపిచ్చగా కామెంట్స్ చేసే రాంగోపాల్ వర్మ, తన తదుపరి చిత్రం పబ్లిసిటీకోసం దానిలో నటిస్తున్న వర్ధమాన నటుడు రాజ్తరుణ్తోకూడా పిచ్చి కామెంట్స్ మొదలుపెట్టించాడు. వర్మ పెద్ద తోపేమీ కాకపోయినా తాను ఆయన దర్శకత్వంలో సినిమా చేస్తున్నానని, ఆయన తప్పులను తాను సరిచేస్తానని రాజ్ ట్విట్టర్లో వ్యాఖ్యానించాడు. ‘రంగీల’, ‘శివ’ సినిమాలను తానైతే ఇంకా మెరుగ్గా తీసేవాడినని బలంగా ఫీలవుతుంటానని, అయినాకూడా పేర్కొన్నాడు. వర్మ తనను అప్పారావు అనే ముద్దుపేరుతో పిలుస్తూఉండాడని ట్వీట్ చేశాడు.
మరోవైపు, వర్మమాత్రం ట్విట్టర్లో రాజ్‌తరుణ్‌పై పొగడ్తలు గుప్పించటం విశేషం. రాజ్ తరుణ్ అద్భుతమైన నటుడని, అతనితో పోలిస్తే చాలామంది హీరోలు సుబ్బారావులతో సమానం అని వ్యాఖ్యానించాడు. రాజ్ తరుణ్‌కు నటుడిగాకన్నా దర్శకుడిగా చాలా టేలెంట్ ఉందని, పూరి జగన్నాథ్, వీవీ వినాయక్, రాజమౌళిలాంటి దర్శకులకన్నా టేలెంటెడ్ దర్శకుడయ్యే స్థాయి ఉన్న కళాకారుడని ట్వీట్ చేశాడు.
‘ఉయ్యాల-జంపాల’, ‘సినిమా చూపిస్త మావ’ సినిమాలతో రెండు మంచి సూపర్ హిట్లు కొట్టిన రాజ్ తరుణ్‌కు ప్రస్తుతం మంచి డిమాండ్ ఏర్పడింది. అతను ఇటీవల సుకుమార్ నిర్మించిన ‘కుమారి 21F’ అనే చిత్రంలో నటించాడు. ప్రస్తుతం వర్మ దర్శకత్వంలో ఒక సైలెంట్ మూవీలో నటిస్తున్నాడు. మామూలుగా అయితే, ఏ నటుడూ తను నటించే చిత్ర దర్శకుడిపై ఇలా కామెంట్ చేయడన్నది తెలిసిందే. వర్మ కావాలనే, పబ్లిసిటీకోసం రాజ్ తరుణ్‌తో ఈ పిచ్చి కామెంట్స్ చేయిస్తున్నట్లు అర్థమవుతోంది. మరి ఈ కామెంట్స్ ఆ కొత్త హీరో కెరీర్‌కు ఉపయోగపడతాయో, ప్రతిబంధకమవుతాయో చూడాల్సిఉంది.