షార్ట్ ఫిల్మ్స్ తీస్తూ హీరోగా ఉయ్యాల జంపాల సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు రాజ్ తరుణ్. ఆ సినిమా హిట్ అవ్వగానే వెంటనే సినిమా చేయకుండా సంవత్సరం గ్యాప్ తీసుకుని సినిమా చూపిస్త మావ అంటూ వచ్చి మరో హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు. రీసెంట్ గా రిలీజ్ అయిన ‘కుమారి 21ఎఫ్’ సినిమాతో హ్యాట్రిక్ హిట్ కొట్టి ఫుల్ క్రేజ్ సంపాధించాడు. చిన్న బడ్జెట్ తీసే దర్శక నిర్మాతలకు మంచి ఆప్షన్ రాజ్ తరుణ్. బడ్జెట్ తక్కువ సినిమాలైనా అవి పెద్ద విజయం అందుకుంటున్నాయి కాబట్టి ఈ కుర్ర హీరో డేట్స్ కోసం దర్శక నిర్మాతలు క్యూలు కడుతున్నారు.
తీసిన మూడు సినిమాలు సూపర్ హిట్ అందుకున్నాయి కాబట్టి రెమ్యునరేషన్ కూడా పెంచాడని ఫిల్మ్ నగర్ టాక్. మొదటి రెండు సినిమాలకు తక్కువ రెమ్యునరేషన్ తీసుకున్న ఈ హీరో.. కుమారి హిట్ తో కోటి డిమాండ్ చేస్తున్నాడని అంటున్నారు. మూడు సినిమాలకే మనోడు కోట్ల క్లబ్ లో చేరాడా అంటే.. తీసిన మూడు సినిమాలు సూపర్ హిట్ కావడం ఒకటైతే తక్కువ బడ్జెట్ తో రూపొందించిన ఆ సినిమాలు భారీ లాభాలను తెచ్చిపెట్టడం మరో విశేషం.
ప్రస్తుతం ఫుల్ క్రేజ్ మీదున్న ఈ యువ హీరో వరుసెంట సినిమాలను చేస్తూ బిజీగా ఉన్నాడు. తన నటనతో మాస్ ప్రేక్షకులను అలరిస్తున్న రాజ్ తరుణ్ హీరోగా చేస్తే సినిమా హిట్టే అన్నట్టుగా ఉంది. మంచు విష్ణుతో ఓ సినిమా చేస్తున్న రాజ్ వర్మ మూకీ సినిమాలో కూడా నటిస్తున్నాడు.