మోహన్‌బాబు ఫ్యామిలీ అంటే.. అందరి హడలే. వాళ్లతో పనిచేయాలంటే కాస్త ముందూ వెనుకా ఆలోచిస్తుంటారు. టైమింగ్స్ విషయంలో మోహన్‌బాబు మహా స్ట్రిక్టు. మంచు విష్ఱు, మనోజ్‌లు కూడా అంతే! అందుకే వీళ్ల కాంపౌండ్‌లో సినిమా అంటే మిగిలిన వాళ్లు జాగ్రత్తగా ఉండాలి. మొన్నటికి మొన్న మోహన్‌బాబు బ్యానర్లో సినిమా చేసిన నరేష్.. చేస్తున్నంత సేపూ హడలిపోయాడట. ఇప్పుడు రాజ్ తరుణ్ పరిస్థితి కూడా అంతే అనుకొన్నారు సినీ జనాలు. విష్ణుతో రాజ్ తరుణ్ ఈడో రకం – ఆడోరకం సినిమా చేశాడు. అందుకే.. తరుణ్నీ దడదడలాడించేసి ఉంటారనుకొన్నారంతా. అయితే రాజ్ తరుణ్ మాత్రం మంచువాళ్లు ఎంత మంచోళ్లో అంటున్నాడు.
”మోహన్‌బాబు ఫ్యామిలీతో పనిచేయడం కష్టం అని నాతోనూ చాలామంది అన్నారు. కానీ..వాళ్లెంత మంచోళ్లో.. ఆ సంస్థలో పనిచేసినప్పుడే అర్థం అవుతుంది. విష్ణు అన్న చాలా కూల్. ఏ విషయంలోనూ నన్ను ఇబ్బంది పెట్టలేదు. పైగా ‘నా పాత్ర కంటే రాజ్‌తరుణ్ పాత్రకే ఎక్కువ ప్రాముఖ్యం ఇవ్వండి’ అని దర్శకుడితో చెప్పారు. వాళ్లెంత స్పోర్టివ్‌గా ఉంటారో. చెప్పడానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి అంటున్నాడీ కుర్రహీరో. మరి ఇప్పుడైనా మంచు వాళ్లు మంచోళ్లని ఒప్పుకొంటారా?