కష్టమా? అంటే కష్టమే అంటున్నాడీ యువ హీరో. ఓ అమ్మాయి మీకు ‘లవర్’ అవ్వాలంటే ఆమెలో ఏం లక్షణాలు వుండాలి? అని రాజ్‌తరుణ్‌ని ప్రశ్నిస్తే… “ముందు నన్ను భరించగలిగితే చాలు” అంటూ నవ్వేశాడు. మిమ్మల్ని భరించడం అంత కష్టమా? అనుకునేవాళ్లు కోసం అతని లైఫ్ స్టయిల్ ఎలా వుంటుందో చెప్పాడు. ఈతరం కుర్రాళ్ళు అంటే పబ్బులు, పార్టీలు, షికార్లు కామన్. కానీ, రాజ్ తరుణ్ అటువంటి విషయాలు అన్నిటికీ దూరమట. ఒకట్రెండుసార్లు పబ్బులకు ఫ్రెండ్స్ తీసుకువెళ్లినా ఒక మూలాన కూర్చున్నాడట. ముఖ్యంగా తను వర్క్ చేసుకునేటప్పుడు, సినిమాలు చూసేటప్పుడు ఎవరైనా డిస్టర్బ్ చేస్తే నచ్చదని చెబుతున్నాడు. “నేను కంప్లీట్ గా ఆఫ్ మైండెడ్ పర్సన్. ఇంట్లో ఎక్కువ కూర్చుంటా. బయట తిరగను. సినిమాలు చూసేటప్పుడు, కథలు రాసుకునేటప్పుడు పక్కనవాళ్లు డిస్టర్బ్ చేస్తే నచ్చదు. అందుకని, నాలాంటి వాడిని భరించడం కష్టమే” అంటున్నాడు రాజ్ తరుణ్. వచ్చే ఏడాది పెళ్లి చేసుకొనే అవకాశాలు వున్నాయని సంకేతాలు కూడా ఇస్తున్నాడు. 27 ఏళ్లకు ఈ హీరో పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడట. వచ్చే ఏడాదికి 27 నిండుతాయి. ఇంట్లో తాతయ్య తొందర పెడుతున్నార్ట. “నాకు అయితే రెండు మంచి సినిమాలు చేసి, హిట్స్ కొట్టి పెళ్లి చేసుకోవాలని వుంది” అని రాజ్ తరుణ్ చెప్తున్నాడు. ఈ నెల 20న ‘లవర్’తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడీ హీరో.