పాపం… రాజ్ తరుణ్ టైమ్ బాగోలేదు. తన సినిమాలన్నీ వరుసగా ఫ్లాప్ అవుతున్నాయి. ఈ యేడాదొచ్చిన రాజుగాడు డిజాస్టర్‌గా మిగిలింది. దిల్ రాజు లాంటి అగ్ర నిర్మాత హ్యాండు కూడా రాజ్ తరుణ్‌కి అస్సలు కలసి రాలేదు. ‘లవర్’ కూడా బాక్సాఫీసు దగ్గర ఫెయిల్ అవ్వడంతో.. రాజ్ తరుణ్ కెరీర్ గ్రాఫ్ అమాంతంగా పడిపోయింది. తన చేతిలో ఉన్న సినిమాలపై కూడా దాని ప్రభావం పడింది. ‘కుమారి 21 ఎఫ్’ కాంబోలో ఓ సినిమా తెరకెక్కాల్సివుంది. సూర్య ప్రతాప్ ఆల్రెడీ రాజ్ తరుణ్‌కి కథ చెప్పడం, ఈ కాంబో ఓకే అయిపోవడం జరిగిపోయాయి. `లవర్` తరవాత మొదలవ్వాల్సిన సినిమా ఇదే. కానీ.. ఇప్పుడు అది కాస్త ఆగిపోయిందని సమాచారం. తరుణ్‌కి ఎదురవుతున్న వరుస ఫ్లాపులు ఒక కారణమైతే, సూర్య ప్రతాప్ కి మరో మంచి ఆఫర్ రావడం మరో కారణం. అలా.. రాజ్ తరుణ్ చేతిలో ఉన్న ఈ సినిమా కాస్త జారగిపోయింది. పైగా తరుణ్ ఇప్పుడు సినిమాలు చేసే మూడ్‌లో లేడు. కొన్ని రోజుల పాటు.. కథలకు, సినిమాలకు దూరంగా ఉండాలని డిసైడ్ అయ్యాడట. అందుకే ఆమధ్య తిరుపతి వెళ్లి గుండు కొట్టించుకుని మరీ వచ్చాడు.