రాజ్ తరుణ్ మళ్లీ స్పీడు పెంచుతున్నాడు. తన చేతిలో రెండు మూడు ప్రాజెక్టులు ఉన్నాయి. మధుర శ్రీధర్ బ్యానర్లో ఓ సినిమా చేయడానికి రెడీ అయ్యాడు. ఈ చిత్రానికి సంజీవ్ రెడ్డి దర్శకత్వం వహిస్తారు. అల్లు శిరీష్ ` ఏబీసీడీ` చిత్రంతో దర్శకుడిగా మారాడు సంజీవ్. ఇది రెండో సినిమా. ఈ చిత్రానికి ‘శీఘ్రమేవ సంతాన ప్రాప్తిరస్తు’ అనే టైటిల్ ని రిజిస్టర్ చేయించారు. ఇదో వెరైటీ కథ అని తెలుస్తోంది. త్వరగా తండ్రి అయిపోవాలని కలలు కనే ఓ కుర్రాడి కథ. `విక్కీ డోనర్` టైపు కాన్సెప్ట్ అట. స్క్రిప్టు పనులు ఇది వరకే పూర్తయ్యాయి. రాజ్ తరుణ్ నటించిన `ఒరేయ్ బుజ్జిగా` విడుదలకు సిద్ధమైంది. త్వరలోనే దీన్ని ఓటీటీలో విడుదల చేస్తారని ప్రచారం సాగుతోంది. ఆ తరవాత పట్టాలెక్కే సినిమా ఇదే కావొచ్చు.