చిన్న హీరో..పెద్ద కలెక్షన్లు..రాజ్ తరుణ్. సీతమ్మ సిత్రాలు..చిన్న సినిమా..బాగానే అమ్మేసుకున్నారు. ఇప్పుడు మొదలైంది అసలు కథ. పాపం బయ్యర్లు కిందా మీదా అయిపోతున్నారు. సగానికి సగం ఎగిరిపోతోందట. ఇదిలా వుంటే నిర్మాతలు ఏడాదిన్నర పని చేయించుకుని కొత్త డైరక్టర్ గవిరెడ్డి శ్రీనివాస్ కు టీడీఎస్ లు వగైరా కట్ చేసి, ఎనిమిది లక్షల చిల్లర చేతిలో పెట్టారట. అందులోనే అసిస్టెంట్ లకు, అసోసియేట్ లకు, ఇంకా..ఇంకా. దాంతో నెలకు డైరక్టర్ అండ్ కో పదివేలు వంతున జీతాలు తీసుకున్నారు అనుకున్నా, ఈ మొత్తం చాలదు. సినిమా హిట్ అయితే చాన్స్ వస్తుంది కదా..అనుకుని, చేసిందానికి దక్కిందే చాలు అని ఊరుకున్నారు. ఇప్పుడు వెంటనే సినిమా వచ్చేలా లేదు. దాంతో పైకి చెప్పుకోలేక..లోపల వుంచుకోలేక కిందా మీదా అవుతున్నాడు ఆ డైరక్టర్ అని వినికిడి.