నారా ఫ్యామిలీ నుండి హీరోగా ఎంట్రీ ఇచ్చిన రోహిత్ స్టార్ గా నిలబడేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు. రెండు నెలల వ్యవధిలోనే రెండు సినిమాలను ప్రేక్షకుల ముందుకు తెచ్చిన రోహిత్ ఇప్పుడు మూడో సినిమాను కూడా రిలీజ్ చేస్తున్నాడు. తుంటరి మాములుగా ఆడినా సావిత్రి మాత్రం సేఫ్ సైడ్ అయ్యేలా చేసింది. ఇక అదే జోష్ తో ఇప్పుడు రాజా చెయ్యి వేస్తే తో రాబోతున్నాడు నారా రోహిత్. నందమూరి తారక రత్న ఈ సినిమాలో విలన్ గా చేయడం విశేషం. అయితే సర్దార్ గబ్బర్ సింగ్ రిలీజ్ అయిన వన్ వీక్ కే మంచు విష్ణు ఈడోరకం ఆడోరకం వదిలి ఎంత సాహసం చేశాడో. ఇప్పుడు సరైనోడు రిలీజ్ అయిన వారానికి నారా రోహిత్ రాజా చెయ్యి వేస్తే సినిమా రిలీజ్ చేస్తున్నాడు.
సర్దార్ రచ్చ చేసినా ఈడోరకం ఆడోరకం కామెడీతో హిట్ టాక్ సొంతం చేసుకుంది. సర్దార్ కన్నా సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది. ఇక సరైనోడు కూడా డివైడ్ టాక్ వచ్చినా కలక్షన్స్ బాగానే ఉన్నాయి. మరి ఇలాంటి టైంలో రాజా చెయ్యి వేస్తే రావడం పెద్ద సాహసమే. ఒకవేళ సరైనోడు భారీ హిట్ సాధిస్తే రిలీజ్ పోస్ట్ పోన్ చేద్దామనుకున్న నిర్మాత సాయి కొర్రపాటి రాజాను ఈ నెల 29కు ప్రేక్షకుల ముందుకు తెస్తున్నాడు. మరి సరైనోడు ముందు రాజు నిలబడతాడో లేదో చూడాలి.