ప్రభాస్ – మారుతి కాంబినేషన్ లో ఓ చిత్రం రూపుదిద్దుకొంటోంది. డి.వి.వి.దానయ్య నిర్మాత. ఈ కాంబోకి సంబంధించిన న్యూస్ ఎప్పుడు వచ్చిందో, అప్పటి నుంచీ `రాజా డీలక్స్` అనే పేరు కూడా బయటకు వచ్చేసింది. ఈ సినిమాకి రాజా డీలక్స్ అనే పేరు పెట్టారని ప్రచారం జరిగింది. ఆ తరవాత… ఈ పేరు మార్చాలని ప్రభాస్ మారుతిని సూచించాడని, మారుతి కూడా అదే పనిలో ఉన్నాడని వార్తలొచ్చాయి.
నిజానికి రాజా డీలక్స్ అనేది.. ప్రభాస్ కోసం పెట్టిన పేరు కాదు. రవితేజ కోసం మారుతి ఓ కథ తయారు చేశాడు. దానికి రాజా డీలక్స్ టైటిల్. ప్రభాస్ తో మారుతి సినిమా తీస్తున్నాడగానే, ఆ టైటిల్ బయటకు వచ్చేసింది. దాంతో.. మీడియా కథలు అల్లేసింది. ఆ టైటిల్ కీ, ప్రభాస్ సినిమాకీ లింకు పెట్టేసింది. రాజా డిలక్స్ వేరు, ప్రభాస్ సినిమా వేరు. రెండింటికీ అస్సలు సంబంధమే ఉండదు. ప్రభాస్తో సినిమా అవ్వగానే, రవితేజతో `రాజా డిలక్స్` పట్టాక్కించే పనిలో ఉన్నాడు మారుతి. ప్రస్తుతానికి ప్రభాస్ కోసం వేడి వేడి కథని వండుతున్నాడు మారుతి. ఆ కథకి సంబంధించిన పనులు చక చక జరుగుతున్నాయి. ఇందులో ముగ్గురు హీరోయిన్లు ఉండడం మాత్రం ఖాయమైంది. వాళ్ల పేర్లు బయటకు వచ్చినా, ఈ విషయంలో ఇంకా మారుతి ఏ నిర్ణయమూ తీసుకోలేదట.