ప్రభాస్ – మారుతి కాంబోలో రూపుదిద్దుకొంటున్న సినిమా ‘రాజాసాబ్’. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఆశలన్నీ ఈ సినిమాపైనే ఉన్నాయి. ఏప్రిల్ 10న ఈ చిత్రాన్ని విడుదల చేస్తామని చెబుతున్నారు. అయితే అప్పటికి విజువల్ ఎఫెక్ట్స్ సిద్ధమవుతాయా? లేదా? అనే ఓ అనుమానం ఉంది. ప్రస్తుతానికైతే టాకీ పార్ట్ పూర్తయ్యింది. మరో 4 పాటలు బాకీ ఉన్నాయి.
రెండు పాటల్ని హైదరాబాద్లో తెరకెక్కిస్తారు. జనవరిలో ఈ సాంగ్స్ షూటింగ్ ఉంటుంది. అందుకోసం సెట్స్ కూడా డిజైన్ చేస్తున్నారు. మరో రెండు పాటల్ని మార్చిలో షూట్ చేస్తారు. అందుకోసం విదేశాల్లో లొకేషన్ల కోసం రెక్కీ కూడా చేస్తున్నారు. అంటే.. మార్చి నాటికి పాటలు కూడా అయిపోతాయి. విజువల్ ఎఫెక్ట్స్ కి పెద్ద పీట వేసిన సినిమా ఇది. సెకండాఫ్లో వీఎఫ్ఎక్స్ కి చాలా ప్రాధాన్యం ఉంది. అందుకు సంబంధించిన వర్క్ ఎప్పుడు పూర్తవుతుందన్నది సందిగ్థంగా ఉంది. అన్నీ అనుకొన్నట్టు జరిగితే ఏప్రిల్ 10న రాజాసాబ్ వస్తుంది. ఈ డేట్ మిస్ అయితే… మేలో విడుదల పక్కా.
ఈ క్రిస్మస్కి గానీ, జనవరి 1కి గానీ రాజాసాబ్ నుంచి ఓ టీజర్ రావొచ్చు. మారుతి ఓ రఫ్ కట్ ఇప్పటికే సిద్ధం చేశారు. దానికి సంబంధించిన ఆర్.ఆర్, వీఎఫ్ఎక్స్ వర్క్ పూర్తి కావాల్సివుంది.