తెలుగు సినిమా అంతా ‘కల్కి’ ఫీవర్‌లో ఊగిసలాడుతోంది. మరోవైపు ‘రాజాసాబ్’ పనులు కూడా జోరుగా సాగుతున్నాయి. ప్రస్తుతం దర్శకుడు మారుతి చెన్నైలో ఉన్నారు. సంగీత దర్శకుడు తమన్ తో కలిసి మ్యూజిక్ సిట్టింగ్స్ లో బిజీగా గడుపుతున్నారు. మెరీనా బీచ్‌లో మారుతి, తమన్ కలిసి సరాగాల కూర్పులో తలమునకలై ఉన్నారు.
‘రాజాసాబ్’ లో మొత్తం 5 పాటలు ఉండబోతున్నాయి. ఇప్పటికే తమన్ 3 పాటలకు ట్యూన్లు ఇచ్చేశాడు. మరో రెండు పాటలు బాకీ. అవి కూడా రాబట్టుకొనే పనిలో చెన్నై వెళ్లారు మారుతి. 2025 సంక్రాంతికి ‘రాజాసాబ్’ని తీసుకురావాలని ప్లాన్ చేశారు. అయితే అప్పటికి సినిమా సిద్ధమయ్యే ఛాన్సులు కనిపించడం లేదు. అందుకే 2025 వేసవి బరిలో నిలిపేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ‘కల్కి’ తరవాత విడుదలయ్యే ప్రభాస్ సినిమా ఇదే. హారర్ కామెడీ నేపథ్యంలో సాగే సినిమా ‘రాజాసాబ్’. ఇందులో సంజయ్‌దత్ ఓ కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. ‘కల్కి’ ప్రమోషన్లలో బిజీగా గడిపిన ప్రభాస్ ఇప్పుడు హాలీడే ట్రిప్ కోసం ఫారెన్ వెళ్లబోతున్నాడు. అక్కడ నాలుగు వారాలు గడిపి, తిరిగి ఇండియాకు వస్తాడు. తిరిగొచ్చాక ‘రాజాసాబ్’ షూటింగ్ ప్రారంభం కానుంది.