బీజేపీ నాయకత్వంపై రాజాసింగ్ కు మరోసారి కోపం వచ్చింది. తాను అవసరం లేదనుకుంటే ఇప్పుడే రాజీనామా చేస్తానని ప్రకటించారు. తనకు పార్టీలో చాలా అవమానాలు ఎదురవుతున్నాయని ఫీలయ్యారు. ఇప్పుడు మళ్లీ ఎందుకు కోపం వచ్చిందంటే… గోల్కోండ జిల్లా అధ్యక్ష పదవిని బీసీ లేదా ఎస్సీకి ఇవ్వాలని ఆయన ప్రతిపాదించారట. ఇవ్వలేదట. గోల్కొండ జిల్లా అనేది బీజేపీ వాళ్లు చేసుకున్న విభజనలో ఉంది . మాములుగా లేదు. ఆ జిల్లాకు అధ్యక్షుడ్ని కూడా ఇటీవల నియమించారు.
అయితే ఈ జిల్లాపై తన పెత్తనం ఉండాల్సిందేనని అనుకుంటున్న రాజాసింగ్ ఓ నేతను ప్రతిపాదించారు. కానీ హైకమాండ్ ఆ పేరును పట్టించుకోలేదు. దాంతో రాజాసింగ్ ఫీలయ్యారు. ఆయన పూర్తిగా మజ్లిస్ నేతలతో కలిసి తిరుగుతారని ఆయనకు ఎందుకు చాన్సిచ్చారని అంటున్నారు. తన అవసరం పార్టీకి లేదనుకుంటే పోతానని ఆయన చెబుతున్నారు.
నిజానికి రాజాసింగ్ ఎప్పుడూ సంతృప్తిగా ఉండరు. ఢిల్లీ నాయకత్వం రాజాసింగ్ ను ప్రోత్సహిస్తుంది కానీ..రాష్ట్ర నాయకత్వం మాత్రం పెద్దగా గుర్తించదు. అధ్యక్షుడిగా ఎవరు ఉన్నా అదే సమస్య. కిషన్ రెడ్డితో అసలు సరిపడదు. బండిసంజయ్ తోనూ సమస్యలు ఉన్నాయి. తర్వాత సర్దుకున్నారు. ఇప్పుడు జిల్లాల అధ్యక్ష పదవితో మరోసారి ఫీలయ్యారు. విశేషం ఏమిటంటే.. ఆయనను బుజ్జగించేందుకు కూడా ఎవరూ ప్రయత్నించారు.