మూడు రాజధానులంటూ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి చేసిన దారుణ మోసాన్ని ఏపీ ప్రజలు ఎప్పటికీ మర్చిపోలేరు. రాజధాని లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఎవరికీ అక్కర్లేని, ఎవరూ కోరుకోని రికార్డు సృష్టించింది. రాజధాని కోసం రైతులు ఇచ్చిన భూమికి అర్థం లేకుండా పోయింది. మరి ఆ రైతులకు కోపం వస్తే, ఉద్యమం చేస్తే ఎలా ఉంటుందో చెప్పడానికి ఓ సినిమా వస్తోంది. అదే. ‘రాజధాని ఫైల్స్’.
ఏపీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి అక్రమ పాలనకు, రైతులకు చేసిన అన్యాయానికి ఈ సినిమా ఓ నిలువుటద్దంలా తోస్తోంది. ”140 కోట్ల జనాభా ఉన్న దేశానికి ఒక్క రాజధాని. ఆరు కోట్ల రాష్ట్రానికి రాజ్యాంగబద్ధమా? వ్యక్తిగత ద్వేషమా?” అంటూ ఈ ట్రైలర్లో సూటిగా ఓ ప్రశ్న సంధించారు. పరదాల ముఖ్యమంత్రి అంటూ నేరుగా విమర్శనా బాణాన్ని ఎక్కు పెట్టారు. గుడివాడలో నిర్వహించిన కాసినోలు, బాబాయ్ – గొడ్డలి ఎపిసోడ్లూ అన్నీ ఈ ట్రైలర్లో కనిపిస్తున్నాయి. కచ్చితంగా రాజకీయ దుమారాన్ని రేపే కంటెంట్ ఈ కథలో ఉన్నట్టు కనిపిస్తోంది. భాను దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి రవిశంకర్ నిర్మాత. అఖిలన్, వీణ, వినోద్ కుమార్, వాణీ విశ్వనాథ్ కీలక పాత్రలు పోషించారు. మణిశర్మ సంగీతాన్ని అందించారు. ఈనెల 15న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈనెల 9న ‘యాత్ర 2’ విడుదల అవుతున్న నేపథ్యంలో దానికి ఇచ్చే కౌంటర్ గా ఈ సినిమాని చూడొచ్చు.