బీజేపీ తొలి జాబితాలో ఆ పార్టీ స్కీనింగ్ కమిటీ చైర్మెన్ రాజగోపాల్‌రెడ్డికి అభ్యర్థిత్వం ఖరారు కాలేదు. అసెంబ్లీ ఎన్నికల్లో మునుగోడులో సింపతితో ఆయన కచ్చితంగా గెలుస్తాడని బీజేపీ నాయకత్వం ఆయనకు భరోసా ఇస్తోంది. కానీ, ఆయన మాత్రం అక్కడ నుంచి పోటీచేసేందుకు వెనకాముందు ఆలోచిస్తున్నారు. ఎన్నిసార్లు సర్వే చేయించుకున్నా కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థుల మధ్యే పోటీ కనిపిస్తోందట . బరిలో ఉంటే తాను గెలవడం సాధ్యం కాదని తేలటంతో ఆయన పునరాలోచనలో పడ్డారని అంటున్నారు.
ఒకవేళ కాంగ్రెస్ గనుక ఆ సీటును సీపీఐకి కేటాయిస్తే కాంగ్రెస్ ఓట్లు తనకు క్రాస్ అయితే గెలువొచ్చనే ఆలోచనతో ప్రస్తుతానికి తన అభ్యర్థిత్వాన్ని హౌల్డ్‌లో పెట్టాలని రాజగోపాల్‌రెడ్డి జాతీయ నాయకత్వాన్ని కోరినట్టు సమాచారం. మునుగోడులో కాంగ్రెస్ అభ్యర్థి బరిలో ఉంటే తనకు ఎల్బీనగర్ సీటు కేటాయించాలనీ, లేనిపక్షంలో తాను అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేయబోనని ఆయన చెబుతున్నారు. ఆయన ఎల్బీ నగర్‌కు రావడంపై రంగారెడ్డి జిల్లా బీజేపీ నేతలు అస్సలు అంగీకరించడం లేదు. ఎల్బీనగర్ లో సామ రంగారెడ్డి అనే నేత ఉన్నారు. కార్పొరేషన్ ఎన్నికల్లో 12 డివిజన్లకు పది డివిజన్లలో గెలిపించారు.
మొదటి జాబితాలో వీలైనంత వరకూ సీనియర్ల పేర్లను ప్రకటించారు. బండి సంజయ్ కు టిక్కెట్ ఇచ్చారు కానీ కిషన్ రెడ్డికి ఇవ్వలేదు. ఆయన అంబర్ పేటలో పోటీ చేయడానికి వెనుకంజ వేస్తున్నారు. హైకమాండ్ కూడా ఒత్తిడి చేయడం లేదు. సీట్ల విషయం కూడా బీజేపీకి సమస్యగా మారింది.