పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ పోటీ చేస్తున్న రాజమండ్రి లోక్ సభ స్థానం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురందేశ్వరి రాజమండ్రి నుంచి పోటీ చేస్తున్నారు. గతంలో వచ్చిన ఫలితాలు, ప్రస్తుత ట్రెండ్ చూస్తే పురందేశ్వరి ఈజీగా గెలుస్తారని ఎక్కువ మంది భావిస్తున్నారు. జనసేన పొత్తు మరింత ఎక్కువగా కలసి రానుంది.
రాజమహేంద్రవరం పార్లమెంట్ పరిధిలో ఏడు నియోజకవర్గాలు ఉన్నాయి. రాజమండ్రి సిటీ, రూరల్ తో పాటు ఆనపర్తి, రాజానగరం, కోవ్వూరు, నిడదవోలు, గోపాలపురం స్థాలు ఉన్నాయి. రాజమండ్రి లోక్సభకు మొత్తం 12 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ప్రధాన పోటీ మాత్రం టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి అభ్యర్థి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి మధ్యే ఉండనుంది. వైసీపీ నుంచి రాజకీ యాలకు కొత్త అయిన డా.గూడూరి శ్రీనివాస్ పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ అభ్యర్థిగా పీసీసీ మాజీ ప్రెసి డెంట్, మాజీ ఎమ్మెల్సీ గిడుగు రుద్రరాజు పోటీలో ఉన్నా ప్రభావం చూపించడం కష్టమే. కూటమి అభ్యర్థి దగ్గుబాటి పురందేశ్వరి ఎన్టీఆర్ కుమార్తె కావడం వల్ల ఆమెపై స్థానికేతర ముద్ర వేయడం సాధ్యం కావడం లేదు.
వైసీపీ అభ్యర్థి గూడూరి శ్రీని వాస్ రాజకీయాలకు కొత్త. కొన్ని నెలల కిందటే ఆయన రాజకీయాల్లోకి వచ్చారు. మంచి డాక్టరే కావొచ్చు. కానీ రాజకీయ ఎత్తులు, వ్యూహాలు, ప్రజలను ఆకట్టుకునే విధానంలో వెనుకబడి ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. పైగా చాలా చోట్ల వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థులు తమ ప్రచారంలో ఎంపీ అభ్యర్థి గురించి పెద్దగా ప్రచారం చేయ డం లేదు. రాష్ట్ర విభజన తర్వాత ఉనికి కోల్పోయిన కాంగ్రెస్ మళ్లీ పుంజుకోవడానికి ప్రయత్నాలు చేస్తుంది.దీనిలో భాగంగానే పూర్తి స్థాయిలో అభ్యర్థులను కాంగ్రెస్ పార్టీ బరిలో నిలిపింది. రాజమ హేంద్రవరం లోక్సభకు పీసీసీ మాజీ ప్రెసిడెంట్ గిడుగు రుద్ర రాజు పోటీలో ఉన్నారు . కాంగ్రెస్ పార్టీ చీల్చే ఓట్లు.. వైసీపీకి నష్టం కలిగించనున్నాయి.
గత ఎన్నికల్లో టీడీపీ జనసేన విడివిడిగా పోటీ చేశాయి. రెండు పార్టీలు కలిసి యాభై శాతం ఓట్లు వచ్చాయి. వైసీపీకి 47 శాతం ఓట్లు వచ్చాయి. ఆనపర్తిలో భారీ మెజారిటీ రావడం కలసి వచ్చింది. ఈ సారి ఆనపర్తిలో బీజేపీ అభ్యర్థిగా నల్లమిల్లి రామకృష్ణారెడ్డి బరిలో ఉన్నారు. అక్కడ కూడా ఈ సారి బీజేపీకి మెజారటీ వస్తుందన్న అభిప్రాయం ఎక్కువగా వినిపిస్తోంది. కూటమి బలం.. వైసీపీ బలహీన అభ్యర్థి వెరసి.. పురందేశ్వరికి సునాయాస విజయం లభిస్తుందని అంచనా వేస్తున్నారు.