ప్రస్తుతం రాజమౌలి చేయబోయే బాహుబలి పార్ట్ 2 మీద అందరికి కళ్లు ఉన్నాయ్. అయితే సాధారణంగా అందరికి వచ్చే ఇంకో సందేహం ఏంటంటే జక్కన్న బాహుబలి-2 తర్వాత తీసే సినిమా ఏంటని. ఓ పక్క ఈగ-2 తీస్తాడని కొందరు అంటుంటే కాదు కాదు మరేదో సినిమా చేస్తాడని అంటున్నారు. రీసెంట్ గా రాజమౌలి క్యాంప్ నుండి లీక్ అయిన న్యూస్ ఏంటంటే రాజమౌలి మరో అద్భుతమైన ప్రాజెక్ట్ కు శ్రీకారం చుట్టబోతున్నారట. ఆ సినిమా టైటిల్ ‘గరుడ’ అని తెగ హడావిడి చేస్తున్నారు. అయితే ‘గరుడ’ సినిమాలో హీరో ఎవరై ఉంటారా అని ఆలోచిస్తుంటే ఇంకెవరు సూపర్ స్టార్ మహేష్ బాబే అని కొందరు గట్టిగా చెబుతున్నారు.
రాజమౌలి, మహేష్ కాంబినేషన్ సినిమా ఎప్పటినుండో అనుకుంటున్నా అది కార్యరూపం దాల్చలేదు. అయితే రాజమౌలి గరుడ కథ మాత్రం మహేష్ కోసమే సిద్ధం చేశాడని ఫిల్మ్ నగర్ టాక్. అంతేకాదు దీని బడ్జెట్ ఎస్టిమేషన్ దాదాపు 500 కోట్ల రూపాయలట. వింటుంటేనే షాకింగ్ అనిపిస్తున్న ఈ సినిమా ఇక కార్యరూపం దాల్చితే ఎలా ఉంటుందో.
ఇంతకుముందైతే ప్రిన్స్ మహేష్ తో జక్కన్న ఓ సినిమా తీస్తున్నాడని దానికి కె.ఎల్.నారాయణ ప్రొడ్యూస్ చేస్తారని న్యూస్ వచ్చింది. అయితే ఈ సినిమా బడ్జెట్ 500 కోట్లు కాబట్టి ఫారిన్ ప్రొడ్యూసర్ ని కూడా దీనిలో ఇన్వాల్వ్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నాడట రాజమౌలి. మరి ఈ ప్రాజెక్ట్ నిజమా కాదా..? దీనికి సంబధించిన మరింత సమాచారం మరి కొద్దిరోజుల్లో తెలుస్తుంది.