పాన్ ఇండియా ఎదురుచూస్తున్న సినిమా ‘ఆర్ఆర్ఆర్’. రామ్ చరణ్, ఎన్టీఆర్ లాంటి బిగ్ స్టార్స్ తో దర్శక బాహుబలి రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమా ఈనెల 25న ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ప్రస్తుతం చిత్ర యూనిట్ ప్రమోషన్స్ లో బిజీ వుంది. మీడియా చిట్ చాట్ లో పాల్గొంటున్నారు. ఆర్ఆర్ఆర్ విశేషాలు పంచుకుంటున్నారు. అదే సందర్భంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ ల వున్న వర్క్ ఎక్సపీరియన్స్ పంచుకున్నారు రాజమౌళి. ఎన్టీఆర్ ని కంప్యూటర్ గా చరణ్.. వైట్ పేపర్ తో పోల్చారు జక్కన్న.
”రామ్ చరణ్, ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ తో కాదు అంతకుముందే నుంచి మంచి స్నేహితులు. ఇద్దరితో సినిమాలు చేశా. ఆర్ఆర్ఆర్ సెట్ లో ఇద్దరి ఓకే చోట చూడ్డం నాకూ ఓ కొత్త అనుభూతి. రామ్ చరణ్, ఎన్టీఆర్ అద్భుతమైన నటులు. వారి వర్కింగ్ స్టయిల్ గురించి చెప్పాలంటే.. ఎన్టీఆర్ ని చూసినప్పుడు ఒక కంప్యూటర్ లా అనిపిస్తాడు. మాలులు గ్రాస్పింగ్ పవర్ కాదు. మనం ఒకటి చెప్పిన వెంటనే రెండోది పట్టెస్తాడు. చరణ్ మాత్రం నాకు తెల్లకాగితం లా అనిపిస్తాడు. సీన్ , డైలాగ్ చెప్పిన తర్వాత చాలా ఆలోచిస్తాడు. దాని కోసం కసరత్తులు చేస్తాడు. కానీ సెట్ కి వచ్చినపుడు మాత్రం అవన్నీ పక్కనే పెట్టేసి ..ఒక వైట్ పేపర్ లో కనిపిస్తాడు. ఆ కాగితంలో మనం అద్భుతం రాస్తే మహాద్భుతం చేస్తాడు. ఎన్టీఆర్, చరణ్ లాంటి నటులతో ఆర్ఆర్ఆర్ చేయడం ఓ అద్భుతమైన అనుభూతి” అని చెప్పుకొచ్చారు రాజమౌళి.